సూక్తులు. సేకరణ. పెద్ది సాంబశివరావు, 94410 65414. peddissrgnt@gmail.com
 జీవితం-
@ నన్ను మెచ్చుకునే వారి కన్నా నన్ను విమర్శించే మిత్రుల నుంచే – నేను జీవితం గురించి ఎక్కువ నేర్చుకున్నాను.  మహాత్మాగాంధీ
@నా జీవితం అధ్యయనంలో, వైజ్ఞానిక సంభాషణలు వినడంతో గడిచింది.   నాకు దేవునిలో నమ్మకం లేదూ, భక్తీలేదు. ప్రేమ్ చంద్
@నియమాలు లేని జీవితం చెల్లని నాణెం వంటిది. శ్రీనాధుడు
@పరాజయాలను పట్టించుకోకండి.  అవి సాధారణం.   అవే జీవితానికి మెరుగులు దిద్దేవి.   ఓటమి లేని జీవితం ఉండదు.  వివేకానంద
@పరిపాలనలో పాల్గొనడానికి బుద్ధిమంతులు నిరాకరించి దూరంగా వుంటే, దుష్టపరిపాలనతో జీవితం గడిపే శిక్ష వారూ అనుభవించ వలసి ఉంటుంది. ప్లేటో
@పరీక్షలను ఎదుర్కోలేని జీవితం నిరర్థకం. సోక్రటీస్
@ప్రధానంగా నా ఆసక్తి ఈ ప్రపంచంలోనే, ఈ జీవితంలోనే, మరొక ప్రపంచం, మరొక జీవితం ప్రసక్తి నాకు లేదు.
@ప్రాణ దానం కన్నా విద్యాదానం గొప్ప.   ఎందుకంటే జ్ఞానమే మానవుని యదార్థ జీవితం.

కామెంట్‌లు