సూక్తులు. సేకరణ. పెద్ది సాంబశివరావు, 94410 65414. peddissrgnt@gmail.com

 జీవితం
@ ప్రేమ ఉన్న చోట జీవితం ఉంటుంది, పగ ఉన్నచోట నాశనం ఉంటుంది. గాంధీజీ
@ప్రేమించడానికెవరో ఉండి, శుద్ధ అంతరంగం కలవారికి జీవితం ఎంతో మధురమయిందీ, మహానందకరది. టాల్ స్టాయ్
@ప్రేరణ లేని మనిషికి జీవితం అంతా చీకటే. కాళోజి నారాయణరావు
@భయపడటం ఎప్పుడు మానేస్తామో, అప్పుడే మన జీవితం మొదలైనట్లు.   చేగువేరా
@మంచిమిత్రులు, మంచి పుస్తకాలు, విచక్షణాజ్ఞానం ఉన్నదే ఆదర్శ జీవితం.  మార్క్ ట్వయిన్
@మహోన్నత వ్యక్తిత్వాన్ని ఏర్పరచుకోవడానికి ఉపయోగపడని బోధనలు వ్యర్ధం.
@మానవునికి మానవునికీ మధ్య, మానవునికీ పరిసరాలకు మధ్య శారీరక, వైజ్ఞానిక, నైతిక రంగాలలో నిరంతరం జరిగే సంఘర్షణే జీవితం.   
@మిగతా వస్తువులు, సరుకులు ఎన్ని ఉన్నప్పటికీ స్నేహితులు లేని జీవితం నిరర్ధకం.  అరిస్టాటిల్

కామెంట్‌లు