చదువులమ్మ (బాల గేయం);-రావిపల్లి వాసుదేవరావుపార్వతీపురంవిజయనగరం జిల్లా9441713136
చదువులమ్మ ఒడిలో
అక్షరాలు నేర్చుకో
అందమైన అక్షరాల
విలువనూ తెలుసుకో

చదువులమ్మ గుడిలో
సంస్కారం నేర్చుకో
నేర్చిన సంస్కారంతో
నీ విలువను పెంచుకో

చదువులమ్మ ఆదరంతో
అందలాలు

చేరుకో
అందలాలు చేరుకొనీ
ఆనందం పంచుకో

చదువులమ్మ ఆశీస్సులు
అందుకొనీ ఎదిగిపో
ఎదిగి నువ్వు పదిమందికి
సాయంగా నిలిచిపో


కామెంట్‌లు