మా స్వరాల వీణ (కవిత);-గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.సెల్ నెంబర్.9491387977.నాగర్ కర్నూలు జిల్లా.
ఇదే ఇదే మా స్వరాల వీణ
పదే పదే పదే తా మ్రోగే నా
కురుసే ఇల సరాగాలవాన
విరిసే అల నవ్వులనజరానా!

ఆ స్వరాల వీణ మ్రోగింది
సుస్వరాల ఉయలూగింది
వరాలవాన ఇక కురిసింది
పరువాల జాన  మెరిసింది!

మేని తీగతీగకో కొత్త పాట
వాణి తీయనైన  తేనెఊట
అందిస్తుంది అది ప్రతి పూట
స్పందిస్తూ పాడాలి మననోట!

స్వర అక్షరాలను కూర్చుంటుంది
స్వరపేటికలో తా దాచుకుంటుంది
దరువు వేయిస్తూ రాగం తీస్తుంది
దరువు తప్పిస్తేఇక ఆగం చేస్తుంది !

ఇది మా సప్తస్వరాల మంజులవీణ
మరి మీటేదెవరో ఇక ఆ నెరజాన
ఆమె ఎవరో కాదు మా వీణా పాణి
ఈమె శుభకామిని మా లలిత వాణి 


కామెంట్‌లు