వివేకానందుడు ;-లతా శ్రీపుంగనూరు9666779103
 అతనో ఆధ్యాత్మిక గురువు
యోగ,వేదాంగాలు అభ్యాసి
గురువు కు ప్రియ శిష్యుడు
యువతకు దిశా నిర్దేశి
వాక్పటిమకు పాశ్చాత్యులు ముగ్దులు...రాజసం తన ఆహార్యం
పురుషుల్లో ఇంద్రుడు నరేంద్రుడు
వివేకం ను అందరిలో పెంపొందించి
జనం గుండెలో వికసించె నందుడు
హిందూ సంప్రదాయ ఔపోసకుడు
ఆత్మవిశ్వాసం కు నిలువుటద్దం
విజ్ఞానపు దారులు చూపు నిర్దేశి
గెలుపే లక్ష్యం విజ్ఞాన సాధనలొ
అసమాన శాంతి తత్పరుడు
యువతకు భవిత తన ఉనికి
అందరి మదిలో వెలిగే నవకాంతి
మన వివేకానందుడి జయంతి

కామెంట్‌లు