సావిత్రి భాయి పూలె;-లతా శ్రీపుంగనూరు9666779103
బాల్యవివాహాలు భస్మం చేయ
నడుం బిగించిన వనితామణి
సతీ సహగమనం రూపుమాప
అడుగుముందుకేసిన సంఘసంస్కర్త
ప్రపంచం తన ఇల్లని భావించి
అనాదల్ని ఆదరించిన పవిత్ర మూర్తి
పితృస్వామ్య పై కలం యుద్ధం
నడిపిన కవయిత్రి ధీశాలి
విద్య కులాతీతం అని చాటిన కొమ్మ
బడుగు,బలహీన వర్గాలకై 
పాఠశాలలు స్థాపించిన మానవీయత
బాలికల విద్యకు శ్రీకారం చుట్టిన
ప్రథమ మహిళా ఉపాధ్యాయిని
కొవ్వొత్తి చందాన జ్ఞాన వెలుగులు పంచింది
తను కరుగుతూ ఆనందించింది
చదువుల తల్లి సావిత్రి భాయి పూలె 
జ్ఞాన ప్రదాత లు నేటి ఉపాధ్యాయినిలు
కుటుంబ,సమాజాలను తీర్చిదిద్దడంలో
తమదైన శైలిలో విజ్ఞాన కాంతులు పంచాలని
ఆశిస్తూ...
ప్రతి మహిళ తన తనయులకు గురువని
తలంచి...మహిళలకు పాదాభివందనం
చేస్తూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు


కామెంట్‌లు