బడి (బాల గేయం_);-లతా శ్రీపుంగనూరు9666779103
మా చిట్టి చెల్లాయి
 ఆమె పేరు బుజ్జాయి
మారాం చేస్తుంది 
 బడికి వెళ్ళబోనని

అన్ని చిలకమ్మ
 పరుగున వచ్చింది 
పలకను ఇచ్చింది
 పలుకులు చెప్పింది

బుడిబుడి బాతమ్మ
 బలపం తెచ్చింది 
బుజ్జాయి కిచ్చింది 
బడి అంటే గుడి అంది

పిచ్చుకమ్మా వచ్చింది
 పిట్టకథలు చెప్పింది 
కథలు విన బడికెళ్ళమని
బుజ్జికి తెలిపింది

నెమలమ్మ వచ్చింది
 పాప నాట్యం నేర్ప మంది
 ఆట పాట ఏదైనా బడిలోనే
 ఆడుతూ పాడుతూ నేర్వమంది

పాపా పలకా బలపం అందుకుంది
బుడి బుడిఅడుగులు వేసింది
బడిలో గంటలు గణగణ మనగా
 పరుగున బడికి చేరింది


కామెంట్‌లు