చదువే ఒక విహార యాత్ర ; వెంకట రమణా రావు -9866186864
 రవి, మోహన్, రాఘవ  ముగ్గురు ప్రాణ స్నేహితులు స్కూల్ లో ఒకే క్లాస్ లో చదువుతున్నారు. తెలుగు ఇంగ్లీష్ ,  హిందీ, మ్యాథ్స్, సోషల్ , సైన్స్ , మోరల్ సైన్స్ , క్రాఫ్ట్స్ స్పోర్ట్స్ ఇలా ఎన్నో నేర్చుకుంటున్నారు రోజూ . ఇంటికి వెళ్ళాక హోమ్ వర్క్ , ఇలా రోజులు గడుస్తున్నాయి. ఎగ్జామ్స్ జరుగుతున్నాయి , ప్రతి వారం పరీక్ష, ప్రతి నెల పరీక్ష , మూడు నెలలకి పెద్ద పరీక్ష , ఇలా పిల్లలకు ఊపిరి సలపకుండా చదువుతున్నారు.
ఒక  రోజు ముగ్గురు కలిసి  రవి ఇంట్లో హోమ్ వర్క్ చేసుకుని  ఏంటి ఈ చదువు , ఈ స్కూల్ , ఎంత సేపు పుస్తకాలే ,  మన చుట్టూ ఉన్న పక్షులు, జంతువులు, చెట్లు ,ఇవన్నీ ఎం చదువు కున్నాయి , అసలు ఈ చదువులెందుకు, స్కూల్ ఎందుకు అని  కోపం గా అనుకున్నారు. ఇళ్ళకి వెళ్లి భోజనం చేసి నిద్ర లో జారుకున్నారు ఆ ముగ్గురు స్నేహితులు.
 ఆ నిద్ర లో ఒక కల .  చదువు నుంచి తప్పించుకోడానికి ఆ  ముగ్గురు స్నేహితులు ఒక కొత్త లోకం లో కి అడుగు పెట్టారు . ఎక్కడ చూసినా పక్షులు, జంతువులు , చెట్లు , జలపాతాలు ,  అందమైన లోకం. అబ్బా ఎంత బాగుంది ఇక్కడ . స్కూల్ లేదు, పుస్తకాలూ లేవు. హోమ్ వర్క్  లేదు . పక్షులు ఎంత బాగా అరుస్తున్నాయి, ఉడుతలు, కుందేళ్ళు, నెమళ్ళు, ఇలా ఎన్నో వాళ్ళ కి కనిపించాయి. చెట్ల నిండా  రక రకాలైన పళ్ళు ,స్వచ్ఛమైన   నీళ్లు . ఆ వాతావరణం లో వాళ్ళకి ఎదో తెలియని ఆనందం , కేరింతలు కొడుతూ చుట్టూ తిరిగారు. కనిపించిన వాటితో ఆడుకున్నారు. ఎప్పుడూ మనం ఇక్కడే ఉండి పోతే ఎంత   బాగుంటుంది అనిపించింది.
చిన్న చిన్న పక్షులకి , తల్లి పక్షులు తిండి అందిస్తున్నాయి. చిన్న వాటిని పెద్ద జంతువులు ముద్దు పెట్టుకుంటున్నాయి . నీళ్ళల్లో చేపలు ఈత కొడుతున్నాయి. రంగు రంగు  ల పువ్వులు, పక్షులు, చేపలు పళ్ళు ఇలా ఆ లోకం ఆ ముగ్గురినీ బాగా ఆకట్టుకుంది.
 
మోహన్ రాఘవ ఇద్దరూ రవి తో మనం ఇక్కడే  ఉండిపోదాం రా , ఇంటికి వెళ్ళద్దు అన్నారు. అవును నాకు అదే ఇష్టం అనుకుంటూ ఇంకా లోపలి కి నడుస్తూ వెళ్లారు. కడుపు నిండా పళ్ళు తిన్నారు. నీళ్లు తాగారు . అక్కడ వాళ్ళకి ఒక మనిషి  కనిపించాడు . వీళ్ల ముగ్గురిని చూసి ఎవరు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడిగాడు.
ముందు భయపడ్డా , తర్వాత రవి ధైర్యం గా చెప్పాడు , మాకు స్కూల్ కి వెళ్లాలని  లేదు, చదువుకోవాలని  లేదు, ఇక్కడ ఉందామని వచ్చాము అన్నాడు.
పిల్లలూ ఇక్కడ మీరు తప్పకుండా ఇక్కడ ఉండచ్చు. హాయిగా ఆడుకోండి . అయితే మా రాజు గారు మిమ్మల్ని పిలుస్తున్నారు .ఆయన అడిగిన ప్రశ్నలకు మీరు సమాధానం చెప్తే మీరు ఇక్కడే ఎప్పటికీ ఉండిపోవచ్చు .చెప్పలేక పోతే మీరు సమాధానాలు నేర్చుకుని వచ్చి చెప్పాలి అపుడు మీరు ఇక్కడ ఉండచ్చు అన్నాడు.
ఓ సరే మేము అన్ని సమాధానాలు చెప్తాము అతనితో  రాజు గారి దగ్గరకి తీసుకెళ్లమని అడిగారు.
ఆ  మనిషి వెనుక నడుస్తూ ఒక రాజ భవనం లోకి అడుగు పెట్టారు, రాజ భవనం  చాలా పెద్దది . ఎన్నో చెట్లు, మొక్కలు, పక్షులు, ఇలా చాలా ఉన్నాయి.
రాజు గారు వాళ్ళు ముగ్గురుని పిలిచి వాళ్ళ పేర్లు , ఈ లోకం లోకి ఎందుకు వచ్చారు అని అడిగారు . రవి, మోహన్ ,రాఘవ వాళ్ళ పేర్లు చెప్పారు, స్కూల్ , చదువు లేని చోటు  వెతుక్కుంటూ వచ్చాము అన్నారు.
చాలా బాగుంది. మీరు ఇక్కడ హాయిగా ఉండచ్చు. కానీ నేను మిమ్మల్ని ఇప్పుడు ఒక చోటకి  తీసుకెళ్తా. అక్కడ మీరు మీకు చాలా కనిపిస్తాయి. నేను అడిగిన ప్రశ్నలు అన్నిటికీ మీరు సమాధానం చెప్తే మీరు ఇక్కడే ఉండిపోవచ్చు. చెప్పలేకపోతే మీరు సమాధానాలు కనుక్కుని మళ్ళీ ఇక్కడికి రండి. రాజు గారు ఆ ముగ్గురు స్నేహితులని ఒక విశాలమైన ప్రదేశానికి తీసుకెళ్లాడు.
 అది దాటాక దట్టమైన అడవి , అక్కడినుంచి కొండలు లోయలు చూసారు. ఎన్నో పక్షులు గుంపులుగా ఎగురు తున్నాయి, జంతువులు ఎన్నో రకాలు గుంపులుగా పరిగెడుతూ అక్కడ ప్రవహిస్తున్న నది లో నీళ్లు తాగుతున్నాయి. అక్కడ ఎన్నో వింతలూ చూసారు. రాజు గారు మొదటి ప్రశ్న అడిగారు
పిల్లలు ఇక్కడ మీరు చూస్టున్నది అంతా కలిపి ఏమంటారు .
మోహన్ ఉత్సాహం గా ప్రకృతి లేదా పర్యావరణం అంటారు.
బాగా చెప్పారు . అయితే ఇప్పుడు చెప్పండి ఈ ప్రకృతి పర్యావరణం లేకపోతే ఏమవుతుంది
ఓ మాకు తెలుసు అంటూ రాఘవ చెప్పాడు, మనంతినడానికి తిండి ఉండదు నీళ్లు దొరకవు , ఈ పక్షులు జంతువులకి ఉండడానికి స్థలం ఉండదు . ఇవన్నీ ఊరులో మన ఇళ్ళకి వచ్చేస్తాయి.
అబ్బా బాగానే చెప్తున్నారు అంటూ ఇంకా ముందుకు వెళ్లారు. అక్క కొండ పైకి ఎక్కడం మొదలెట్టారు . చలి మొదలైంది. ఇంకా కొంచం పైకి వెళ్లారు ఊపిరి కష్టం అవుతోంది. కిందకి వెళ్ళిపోదాం అంటూ స్నేహితులు ముగ్గురు అన్నారు.
సరే ఇప్పుడు చెప్పండి మనంపైకి వెళ్తూ ఉంటె ఎందుకు చల్లగా ఉంది. ఊపిరి ఎందుకు కష్టం అవుతోంది.
ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుని ఏమో మాకు తెలీదు, మరి ఎలా తెలుస్తుంది మీకు అడిగారు రాజు గారు. స్కూల్ లో టీచర్ చెప్తారు ,మేము అడిగి తెలుసుకుంటాం.
దిగుతూ వేగం గా జారిపోతున్నారు పిల్లలు. నిలదొక్కుకోవడానికి కష్ట పడుతున్నారు. కష్ట పడుతున్నారు.
సరే ఇప్పుడు చెప్పండి , పైకి ఎక్కుతున్నప్పుడు కష్టం అనిపించింది మరి కిందకి దిగుతున్నప్పుడు ఎందుకు అంత వేగం గా జారిపోతున్నారు. ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు, ఇది కూడా మా టీచర్ ని అడుగుతాము. అన్నారు.
పెద్ద జలపాతం కనిపించింది , ఎదో పెద్ద పెద్ద మెషిన్ లు కనిపించాయి.
అటువైపు చుడండి , అక్కడ కరెంటు తయారవుతుంది . అది ఎలా జరుగుతుంది చెప్పండి .
ఏమో మా స్కూల్ లో అడుగుతాము. అన్నారు.
పక్షులు పైకి ఎలా ఎగురుతాయి , మీరు ఎందుకు ఎగరలేరు అడిగారు రాజు గారు.
మాకు రెక్కలు లేవు కదా అందుకే అంటూ అందుకే అంటూ ఒకే సారి చెప్పారు ముగ్గురు. రెక్కలు ఎగరడానికి ఎలా సహాయం చేస్తున్నాయి. చెప్పండి. మనం కూడా రెక్కలు కట్టుకుని ఎగరగలమా చెప్పండి .
మనం ఎగరాలంటే ఏరోప్లేన్ ఎక్కాలి ఎక్కాలి అంటూ చెప్పారు. సరే మరి ఏరోప్లేన్ ఎలా ఎగురుతుంది చెప్పండి. ఎలా ఎగురుతుంది చెప్పండి.
మేము ఇంకా పెద్ద క్లాస్ కి వెళ్లి నప్పుడు , కాలేజీ లో ఇవన్నీ చెప్తారు అన్నారు. మరి ఈ లోకంలో అన్నీ చూస్తున్నారు, కానీ అన్నీ చూస్తున్నారు, కానీ అవి అలా ఎందుకు ఉన్నాయి , వాటి ఉపయోగం ఏంటో తెలియక పోతే ఎలా. , వాటి ఉపయోగం ఏంటో తెలియక పోతే ఎలా.
సూర్యుడు, చంద్రుడు ,గ్రహాలు, వాతావరణం ,పర్యావరణం , జీవ జంతు జాలం , ఇలా మన చుట్టూ ఉన్న వాటి గురించి పూర్తిగా తెలుసుకోవాలి అంటే స్కూల్ కి రోజు వెళ్ళాలి .అన్ని పాఠాలు శ్రద్ధగా  చదవాలి. విజ్ఞానం  సంపాదించాలి. మీకు ఇష్టమైన విషయంలో ఇంకా పై చదువులు చదివి ఎక్కువ జ్ఞానం సంపాదించాలి. ఏ విషయం  కూడా ఊరికే చూస్తూ ఉండకూడదు, దాని గురించి ఎందుకు, ఎలా అని మనలో మనం ప్రశ్నలు వేసుకోవాలి. తెలియనివన్ని స్కూల్ లో టీచర్ ని అడిగి తెలుసుకోవాలి. ఏ  పాఠం అయినా గురించి పూర్తిగా తెలుసుకోవాలి అంటే కి రోజు వెళ్ళాలి .అన్ని పాఠాలు శ్రద్ధగా  చదవాలి. విజ్ఞానం  సంపాదించాలి. మీకు ఇష్టమైన విషయంలో ఇంకా పై చదువులు చదివి ఎక్కువ జ్ఞానం సంపాదించాలి. ఏ విషయం  కూడా ఊరికే చూస్తూ ఉండకూడదు, దాని గురించి ఎందుకు, ఎలా అని మనలో మనం ప్రశ్నలు వేసుకోవాలి. తెలియనివన్ని స్కూల్ లో టీచర్ ని అడిగి తెలుసుకోవాలి. ఏ  పాఠం అయినా అర్ధం చేసుకుని ,ప్రశ్నించుకుని చదవాలి. స్కూల్ అంటే వేరే కాదు , మీ చుట్టున్న వాటి గురించి మీకు అర్ధం అయ్యేలా మీకు విజ్ఞానం  అందించడానికి ఉన్నాయి.
అందుకే అన్ని సబ్జెక్ట్ బాగా చదివి మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోండి. దేశం మెచ్చుకునే మంచి పిల్లలు గా మంచి పౌరులుగా తయారవ్వాలి బాగా చదివి మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చేసుకోండి. దేశం మంచి పిల్లలు గా మంచి పౌరులుగా తయారవ్వాలి తెలిసిందా.
అందమైన పర్యావరణం ని బాగా చూసుకోండి . ఈ భూమి మీద అన్ని ప్రాణులు కలిసిమెలిసి  ఉండాలి . ఎవరికీ హాని చెయ్య కూడదు . అప్పుడే మనం ఈ భూమి మీద ఆనందంగా ఆరోగ్యంగా బ్రతకచ్చు. . ఈ భూమి మీద అన్ని ప్రాణులు కలిసిమెలిసి  ఉండాలి . ఎవరికీ హాని చెయ్య కూడదు . మనం ఈ భూమి మీద ఆనందంగా ఆరోగ్యంగా బ్రతకచ్చు. ఆనందంగా బ్రతకచ్చు.
ఇప్పుడు చెప్పండి పిల్లలు ,మీరు స్కూల్ కి వెళ్లాలా వద్దా. వద్దా.
రవి, మోహన్ ,రాఘవ ముగ్గురూ రాజు గారితో మేము రోజు స్కూల్ కి వెళ్తాము , అన్ని విషయాలు బాగా నేర్చుకుంటాము , పర్యావరణం ని కాపాడుతాము అంటూ ఇక కంఠం తో చెప్పారు. రాజు గారు సంతోషంగా మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇక్కడికి వచ్చి హాయిగా ఆనందించండి . స్కూల్ లో నేర్చుకున్న విషయాలు నాకు చెప్పండి అని వాళ్ళని ఇంటికి వెళ్ళమని ఒక మనిషిని ఇచ్చి పంపించాడు.
రవి ,తొందరగా నిద్ర లే నువ్వు , ఇవాళ సైన్స్ పరీక్ష ఉంది కదా అంటూ అమ్మ లేపడం తో రవి ఒక్క సారి కళ్ళు తెరిచి అబ్బా ఎంత మంచి కల వచ్చింది. ఇవాళ మోహన్ , రాఘవకి చెప్పాలి అనుకుని చదువుకోవడానికి కూర్చున్నాడు,


కామెంట్‌లు