మార్పు;-కె. వెంకట రమణ రావు , సెల్ :9866186864
 ఆ రోజు పనులన్నీ ముగించుకుని వంటిల్లు సర్దేసి పడక గదిలోకి వచ్చి   పుస్తకం చదువుతున్న  సుమన్ పక్క న చేరింది సుజన  . ఏంటి ఎదో ఆలోచిస్తున్నావు అంటూ అడిగాడు సుమన్. ఏమీ  లేదు ఇద్దరం ఉద్యోగం చేస్తున్నాం ,పిల్లలు  ఇద్దరు కాలేజీ కి వచ్చేసారు. స్కూల్ లో ఉన్నంతవరకు మన మాట విన్నారు .ఇప్పుడు అసలు మనం మాట్లాడితేనే విసుక్కుంటున్నారు. ఎవరి గది  లో వాళ్ళు తలుపులు బిగించి కూర్చుంటారు, ఎమన్నా అడిగితే ఆన్లైన్ క్లాస్ లు , స్టడీ డిస్కషన్ అంటారు. ఎం చేస్తున్నారో తెలీదు . పెద్దవాడైతే బైక్ తీసుకుని ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్లి రాత్రి చాలా పొద్దుపోయాక గాని రాడు.వచ్చాక ఎప్పుడో అర్ధరాత్రి దాటాక గాని పడుకోడు . ఇంక  అమ్మాయి  చూస్తే ఎంతసేపు ఎప్పుడూ  ఫోన్ లో నే వుంటుంది . ఏదన్న అడిగితే కోపం . ఎలా సుమన్ వీళ్ళని ఒక దారిలోకి తీసుకురావడం. మొన్న మీ అమ్మ నాన్న వచ్చినప్పుడు వీళ్ళు అసలు వాళ్ళని పలకరించలేదు. పెద్ద వాళ్ళు కొంచం బాధ పడ్డారు. ఉన్న ఉద్యోగం వొదులుకోలేము. ఎం చేద్దాం అంటావు అంటూ సుమన్ వైపు చూసింది .
 సుమన్ అనునయం గా సుజనని దగ్గరకు తీసుకుని , దీనికి అంతా కారణం , మనం వాళ్ళ తో ఎక్కువ టైం గడపడం లేదు. అందుకే స్నేహితులతో  సోషల్ మీడియా లో ఎక్కువ టైం ఉంటున్నారు.
కానీ సుమన్ , నీ ప్రాజెక్ట్ ఇప్పుడు చాల ముఖ్యం , దీని పైన నీ కెరీర్ ఆధారపడింది . నాకు ఆఫీస్ , మీటింగులు తో  సరిపోతోంది. పిల్లలని మనం సరిగ్గా పట్టించుకోడం లేదు అనిపిస్తోంది . అసలు అందరం కలిసి భోజనం చేసి ఎన్ని రోజులైందో. ఈ కరోనా వల్ల అందరూ కలిసి  టూర్ కూడా వెళ్ళలేదు . ఇక ఈ ఫామిలీ ఎలా దారిలోకి వస్తుంది .పిల్లలు మన మాట ఎప్పుడు వింటారు. ఏమైపోతారో అని లోపల బెంగ గా ఉంది అంటూ పక్క మీద వాలింది సుజనా.
బాధ పడకు , వాళ్ళ వయసు అలాంటిది. మెల్లిగా చెప్పి మన దారి లోకి తెచ్చుకోవాలి . వాళ్ళ కి ఏది ఇష్టమో మనం అదే చేద్దాము. పిల్లలకి ఇష్టమైన వంటలు చేసి పెట్టు ,  గేమ్స్ ఆడదాము , వాళ్ళ తో సరదాగా స్నేహితుల లా  ఉందాము. అమ్మ నాన్న అంటూ పెత్తనం చెయ్యద్దు. వాదించద్దు. ప్రేమతో లాలించి , మంచి మాటలతో పిల్లల్ల్ని దగ్గరకు తీసుకుందాము. వాళ్ళ కోసం ప్రత్యేకం గా సమయం పెట్టుకుందాము. రోజు రాత్రి అందరం విధిగా డైనింగ్ టేబుల్ దగ్గర కలిసి భోజనం చేద్దాము. మన ఆఫీస్ విషయాలు వాళ్ళ తో పంచుకుందాము. అలాగే వాళ్ళ కాలేజీ విషయాలు మనం విందాము.  బాగా ప్రోత్సహిస్తూ 
 వాళ్లని మెచ్చుకుందాము . తప్పులని సున్నితం గా సరిదిద్దేలా చెపుదాము .మనం ఎంత ఎక్కువ మాట్లాడుకుంటే అంత దగ్గ ర అవుతాము. ముందు అమ్మ నాన్న , మన ఇల్లు , ఆ తరువాతే ఎవరైనా అన్న భావన పిల్లలలో తీసుకురావాలి. హాయి గా సంతోషం గా ఉల్లాసం గా ఉండే లా ఇల్లు మార్చుకోవాలి.  ఒకరి పై ఒకరికి గౌరవం , ప్రేమ , స్వేచ్ఛ ఉండాలి . ఆ వాతావరణం మనం తీసుకు వస్తే పిల్లలు ఎప్పుడు మన చుట్టూ ఉంటారు. వాళ్ళ వ్యక్తిత్వాన్ని  గౌరవిద్దాం , స్వేచ్ఛ గా వాళ్ళ మనసుని మనతో పంచుకునే అవకాశం ఇద్దాము మార్పు రావాల్సింది పిల్లలో కాదు , మనలో,  తెలిసిందా అంటూ సుజనా వైపు చూసాడు.
అవును సుమన్ నువ్వు చెప్పింది చాలా బాగుంది . మనం మారాలి  , పిల్లల్ని మన ప్రపంచం లోకి తీసుకు రావాలి . మబ్బులు విడిపోయిన ఆకాశం లా సుజన మనసు తేట పడింది. కామెంట్‌లు