స్వామి వివేకానంద జీవితం ; భరద్వాజరావినూతల 9866203795

 ప్రక్రియ-సున్నితం
రూపకర్త -నెల్లుట్ల సునీత 
**************************
3️⃣3️⃣1️⃣)
వంగదేశపు  ముద్దు బిడ్డ  
హైందవధర్మమే అతని అడ్డ 
భరతమాత కీర్తి పెంచినోడు 
చూడచక్కని తెలుగు సున్నితంబు.---!
****************************** 
3️⃣3️⃣2️⃣)
యువతకు  అతడు ఆదర్శం 
దేశభక్తికి నిలువెత్తు రూపం 
విగ్రహారాధనకు అతడు వ్యతిరేకం 
చూడచక్కని తెలుగు సున్నితంబు.---!
****************************** 
3️⃣3️⃣3️⃣)
రామకృషుని  ప్రియ శిష్యుడు 
అలౌకిక వాదనలో అద్వితీయుడు 
సత్య జ్ఞాన మార్గాన్వేషకుడు 
చూడచక్కని తెలుగు సున్నితంబు.---!
***************************** 
3️⃣3️⃣4️⃣)
వంగదేశం అతని జన్మస్తలం 
తల్లిమాటపై అచంచల విశ్వాసం 
వివేకానందుడుగా మారిన నరేంద్రుడు 
చూడచక్కని తెలుగు సున్నితంబు.---!
****************************** 
3️⃣3️⃣5️⃣)
క్రమశిక్షణ అతనికున్న శక్తీ 
యువతకు   అతనే స్ఫూర్తి 
అతడు మహోన్నత వ్యక్తి 
చూడచక్కని తెలుగు సున్నితంబు.---!
****************************** 

కామెంట్‌లు