గీతా వాణి!అక్షర పరమేశ్వర తత్వము! "శంకర ప్రియ.," శీల.,సంచార వాణి: 99127 67098
 👌ఆద్యంతములు లేని
   
     ఆది దేవుడ వీవె!
     విశ్వేశ్వరా! హరా!
           శ్రీశివా! కేశవా!
 👌సర్వతో ముఖుడ వైన    
       పరమ పురుషుడ వీవె!
       జగన్నాధా! హరీ! 
             శ్రీశివా! కేశవా!
        
           ( శ్రీ శివ కేశవ పదాలు., శంకర  ప్రియ., )
👌అర్జునుడు.. పరమేశ్వరుని యొక్క విశ్వరూపమును దర్శించు చున్నాడు. భక్తి ప్రపత్తులతో, ఈ విధముగా ప్రార్ధించు చున్నాడు!
👌పరమేశ్వరా! నీవే అక్షర స్వరూపుడ వైన పరంబ్రహ్మ తత్వము! అందరికీ తెలుసుకో దగిన వాడవు! ఈ విశ్వమునకు నీవే, శ్రేష్టమైన ఆశ్రయుడవు! వినాశనము లేని వాడవు!శాశ్వతము లగు ధర్మములను రక్షించు వాడవు! నీవే సనాతనుడవు! పురాణ పురుషుడవు నీవే! అని, నా నిశ్చితాభిప్రాయము! (18)
👌విశ్వరూపా! నీవే..  మొదలు, నడుమ, తుది లేనివాడవు!   అపరిమితమైన శక్తి సామర్ధ్యములు కలవాడవు! అసంఖ్యాకము లైన బాహుబల సంపన్నుడు! సూర్య చంద్రులే.. నీదు నేత్రములు! ప్రచండాగ్నివలె, ప్రజ్వరిల్లు చున్నది.. నీ వదనము! నీ దివ్య తేజస్సుతో ఈ ప్రపంచ మంతను తపింప చేయుచున్నావు! ఆ విధముగా, నీదు విశ్వరూపమును వీక్షించు చున్నాను!" అని, అఖిలాండకోటి బ్రహ్మాoడ నాయకుడైన, ఆదిదేవుని కీర్తించాడు! (19)
🚩 "త్వ మక్షరం పరమం...!" 
"అనాది మధ్యాంత....!" అని
 ( 11.విశ్వ రూప దర్శన యోగము.. 18వ. మరియు 19.వ. శ్లోకము లందు ) పరమేశ్వరుని ప్రార్ధించాడు, పార్ధుడు!
  🙏విశ్వ రూప ప్రార్ధన
       ( తేట గీత పద్యములు )
      ⚜️ ఎరుగదగు పరమాక్షర మీ వటంచు
      
         ఈ జగత్ ప్రబలాధార మీ వటంచు
        అల సనాతన పురుషుండ, అవ్యయుడవు,
          నిత్య ధర్మ గోప్త వటంచు, నే దలంతు!!
⚜️ ఆది మధ్యాంతములు లేని, యట్టివాని,
 
       అపరిమిత వీర్య బాహుల నమరువాని,
      ఆ రవి శశాంక నేత్రు, దీప్తాగ్ని ముఖు, స్వ
      తేజమున జగమేర్చేడి దేవు గంటి!
   ( 'అష్టావధాని' అబ్బరాజు హనుమంతరాయ శర్మ.,)

కామెంట్‌లు