గీతా వాణి: యోగ క్షేమములు!"శంకర ప్రియ.," శీల.,సంచార వాణి: 99127 67098
 👌ముఖ్యమైన వాటిని
   
      సంపాదించడమే!
      "యోగము" అని, అర్ధము!
           ఆత్మ బంధువు లార!
👌ప్రాప్తమైన వాటిని
     సంరక్షించడమే
     "క్షేమము" అని, అర్ధము!
           ఆత్మ బంధువు లార! 
           ( ఆత్మ బంధు పదాలు., శంకర ప్రియ.,)
👌సర్వ శక్తి మంతుడైన భగవానుడు.. సర్వజ్ఞుడు, సమదర్శి, సర్వాంతర్యామి! ఆ సర్వేశ్వరుడు.. భక్త మహాశయుల యొక్క అన్ని విధములైన "యోగ క్షేమము"లను; తానే వహించు చున్నాడు.
 👌పరమేశ్వరుడు,  చతుర్విధ భక్తులైన.. ఆర్తుడు, అర్ధార్థి, జిజ్ఞాసువు, జ్ఞాని.. మున్నగు వారికి; నిత్యము జీవితావసర వస్తువులను, మరియు  పదార్ధములను సమకూర్చు చున్నాడు. పిమ్మట, పరమార్ధ తత్వ జ్ఞానమును ఉపదేశించు చున్నాడు. ఇదియే యోగము!
👌ఆరాధకులు, మరియు సాధకు లందరు సమకూర్చిన వాటిని  సంరక్షించు చున్నాడు! అట్లే, స్వాత్మ తత్వ స్వరూపమును కలిగించు చున్నాడు, పరమేశ్వరుడు! ఇదియే.. క్షేమము!
🚩 "సకల ప్రాణికోటికి..   'యోగ క్షేమములను' నేనే అనుగ్రహించు చున్నాను!" అని, భగవాన్ ఉవాచ!
  🙏గీతా సందేశం
       ( తేట గీతి )
       పొంద లేనట్టి వానిని పొందునట్లు
       చేయుటే, "యోగ"మందురు, సిద్ధజనులు;
        పొంది నటువంటి దానిని పోక యుండ,
        గాచి యుండుట "క్షేమంబు"గా తలంత్రు!!
( 'కవి శేఖర', శ్రీ అబ్బరాజు హనుమంత రాయ శర్మ. )

కామెంట్‌లు