గీతా వాణి:;పత్రం పుష్పం ఫలం తోయం! "శంకర ప్రియ.," శీల.,సంచార వాణి:99127 67098
 👌పత్రమైన సుమమైన
       పరమేశ్వ రార్పణము
        చేయండి భక్తితో!
                ఓ తెలుగు బాల!!
 👌ఫలమైన జలమైన
      పరమేశ్వరుని కెపుడు
      సమర్పణ చేయండి!
                 ఓ తెలుగు బాల!
           ( తెలుగు బాల పదాలు., శంకర ప్రియ., )
👌పరమేశ్వరుడు.. భక్తవత్సలుడు! అందువలన, ఆరాధకులు భక్తిపూర్వకముగా సమర్పించిన ద్రవ్యములను; ప్రేమపూర్వకంగా స్వీకరించు చున్నాడు.
👌భక్త మహాశయులు .. ఏమి చేసినను, అనగా తిని నప్పుడైన, త్రాగి నప్పుడైన.. "పరమేశ్వరార్పణం" అని, భగవంతునకు చిత్త శుద్ధితో సమర్పించాలి!
👌పరి శుద్ధాoతఃకరణు లైన భక్తులు అర్పించిన మారేడాకు, తులసీ దళములకు; వికసించిన పువ్వులకు; దోసిలితో జలమునకు; యథా శక్తిగా నివేదన చేసిన పండ్లకు.. పరమ సంతుష్టి చెందు చున్నాడు, భగవంతుడు!
👌"ఎవరు.. నిర్మల బుద్ధితో, నిష్కామ భావముతో; పరమేశ్వరుడనైన నాకు ... పత్రము, పుష్పము, ఫలము, జలము.. అను వాటిని; సమర్పించు చున్నారో.. వాటిని హృదయ పూర్వకముగా ప్రీతితో స్వీకరించు చున్నాను!" అని; అభయము నొసగు చున్నాడు, అఖిలాండకోటి బ్రహ్మాoడ నాయకుడైన పరమేశ్వరుడు.
🚩"పత్రం పుష్పం ఫలం తోయం!" అని, ( అధ్యాయం.9. రాజవిద్యా రాజగుహ్య యోగం.. 26.వ. శ్లోక రత్నం నందు ) పరమేశ్వరుడు.. భాగవతులకు సందేశ మిచ్చుచున్నాడు.
  🙏గీతా సందేశము
       ( తేట గీతి)
      ఫలమొ, పుష్పమొ, పత్రమొ, జలమొ, యేది
       యైన భక్తి సమర్పించు యతన శీలి;
         ప్రేమ పూర్వక మగు వస్తువితతి గొనుచు
          పార్థ! భుజియింతు, సగుణ రూపమ్ము తోడ!!
      ( గీతా సప్తశతి., 'అష్టావధాని' శ్రీ చల్లా లక్ష్మీ నారాయణ శాస్త్రి., )      

కామెంట్‌లు