గీతా వాణి:యత్కరోషి యదస్నాసి! "శంకర ప్రియ.," శీల.సంచార వాణి: 99127 67098
  👌భక్తి శ్రద్ధల తోను
      మనమేది చేసినను
      ఈశ్వరుని కర్పించు!
                ఓ తెలుగు బాల!!
 👌నియమ నిష్టల తోను
     అర్చన జపాదులను
     ఈశ్వరుని కర్పించు!
                 ఓ తెలుగు బాల!
           ( తెలుగు బాల పదాలు., శంకర ప్రియ., )
👌పరమేశ్వరుడు.. ఒక్కడే! ఈ జగన్నాటకరంగము నందు "సూత్ర ధారి"! ఇందులో.. సమస్త ప్రాణికోటి.. "పాత్ర ధారులే"! అందు వలన, మనము ఆచరించే కర్మలకు కర్త మఱియు భోక్త.. భగవంతుడే! అని, భావించి; మన విధ్యుక్త ధర్మమును తప్పకుండా పాటించాలి! వాటిని "పరమేశ్వరార్పణము" 
కావించాలి.
👌"ఓ అర్జునా! నీవు ఆచరించే శాస్త్ర విహిత మైన,మరియు  వ్యావహారిక మైన కర్మలను నాకు అర్పింపుము! అట్లే, నీవు తినే ఆహారము, చేసే యజ్ఞము, దానము, తపము.. శ్రద్ధా భక్తులతో నాకు సమర్పింపుము!"అని; అభయము నొసగు చున్నాడు, అఖిలాండ కోటి బ్రహ్మాoడ నాయకుడైన పరమేశ్వరుడు.
🚩"యత్కరోషి యదస్నాసి!" అని, ( అధ్యాయం.9. రాజవిద్యా రాజగుహ్య యోగం.. 27.వ. శ్లోక రత్నం నందు ) పరమేశ్వరుడు.. భాగవతులకు సందేశ మిచ్చుచున్నాడు.
  🙏గీతా సందేశము
       ( తేట గీతి)
     నీవు కావించు కర్మను, నీవు తినెడు
      భోజ్యము, హావిస్సునున్.. బుద్ధి పూర్వకముగ
         చేయు దానంబు, సద్విధి చేయు తపము
          అర్పణ మొనర్చు నాకు, బ్రహ్మార్పణముగ!
          
      ( గీతా సప్తశతి., 'అష్టావధాని' శ్రీ చల్లా లక్ష్మీ నారాయణ శాస్త్రి., )       

కామెంట్‌లు