గీతా వాణి: దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం! "శంకర ప్రియ.," శీల.,సంచార వాణి: 99127 67098
  👌నిత్య దేవతార్చన, 
       శుచిత్వము, ఋజుత్వము
        శారీరిక తపస్సు!
                ఓ తెలుగు బాల!!
           ( తెలుగు బాల పదాలు., శంకర ప్రియ., )
👌శారీరిక తపస్సు అనగా.. దేవతలను పూజించడం, వేదము తెలిసిన బ్రాహ్మణులను గౌరవించడం, జ్ఞానోపదేశం చేసిన గురువులను, తత్వవేత్తలను సేవించడం.. మున్నగునవి.
👌బాహ్యాభ్యoతర శుద్ధి కలిగి యుండడమే.."శుచిత్వము"! కుటిలత్వము లేకుండడమే.. "ఋజుత్వము"!అనగా, మనో వాక్కాయము లతో నుండడం! ప్రపంచ మంతా పరమేశ్వర స్వరూపమనే భావనతో; పరంబ్రహ్మ మందు చరించడమే.. "బ్రహ్మచర్యము"! ఎవరికీ ఏబాధ కలుగ కుండా ప్రవర్తించడమే.. "అహింస"!
       ఈ విధంగా, శరీరమునకు సంబంధించిన వాటిని అలవర్చు కోవడమే.. శారీరిక తపస్సు!
👌దేవతలను, బ్రాహ్మణులను, గురువులను, జ్ఞానులను.. సేవించుట;  శుచిత్వము, ఋజుత్వము, బ్రహ్మచర్యము, అహింస.. అనునవి, శరీరంతో చేయబడిన తపస్సు! అని చెబుతారు!
🚩"దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం!" అని, ( అధ్యాయం.17 శ్రద్ధాత్రయ విభాగ యోగం.. 14.వ. శ్లోక రత్నం నందు ) గీతాచార్యుని సందేశము!
  🙏గీతా సందేశము
       ( తేట గీతి)
      దేవ, గురు, విప్ర, విబుధ పూజావిధాన
       ముల జరించుచు, శౌచ విస్ఫూర్తి మించి,
         సరలతాహింస లన్, బ్రహ్మ చర్య నొప్పి
          మనుట, "దైహిక తప" మని, మౌను లండ్రు!
      ( గీతా సప్తశతి., 'అష్టావధాని' శ్రీ చల్లా లక్ష్మీ నారాయణ శాస్త్రి., )       

కామెంట్‌లు