గీతా వాణి:అక్షరం బ్రహ్మ పరమం! "శంకర ప్రియ.," శీల.,సంచార వాణి: 99127 67౦98
 👌నిత్య సత్య మైనది
   
     స్వ ప్రకాశ మైనది
     పరం బ్రహ్మ తత్త్వము!
           ఆత్మ బంధువు లార!
 👌సర్వోత్తమ మైనది
       నాశరహిత మైనది
       పరమేశ్వర రూపము!
             ఆత్మ బంధువు లార!
        
           ( ఆత్మ బంధు పదాలు., శంకర ప్రియ., )
👌"పరమేశ్వరుడు".. ఒక్కడే! నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపుడు! సచ్చిదానందమయ "పరంబ్రహ్మ"! అంతటా వ్యాపించి యున్న "పరమాత్మ"! "అక్షరుడు" అనగా, వినాశనము ( క్షరము) కానివాడు! శాశ్వతుడు! "పరమ"మనగా అన్నిటి కన్నను శ్రేష్టమైన వాడు. సూక్ష్మమైన వాడు.. "పరమేశ్వరుడు"!
👌"అక్షరం పరమం బ్రహ్మ" అని; ( భారతాంతర్గత మైన, శ్రీ శివ సహస్ర నామ స్తోత్రము నందు) పరమేశ్వరుని ప్రస్తుతించారు, శ్రీకృష్ణ పరమాత్మ!
👌"బ్రహ్మ" మనగా.. సర్వ శ్రేష్ఠుడు! నిత్యులైన జీవులకు.. మూల కారణుడు! "అధ్యాత్మ" మనగా తనదైన భావమును కలిగి యుండడం! అది.. ప్రతీదేహము నందు పరమాత్మ యొక్క అంశ రూపములో; ప్రత్య గాత్మ భావమును పొందడమే.. అధ్యాత్మము! అట్లే, జీవుల ఉత్పత్తి, అభ్యుదములకు కారణమైన, ద్రవ్య త్యాగరూప మైన యజ్ఞమే "కర్మ" యందురు! అని, భగవానుడు పేర్కొను చున్నాడు.
🚩 "అక్షరం బ్రహ్మ పరమం!" అని, ( (8) అక్షర బ్రహ్మ యోగము.. 3వ. శ్లోకము నందు )
గీతాచార్యుని సందేశము! 
  🙏గీతా సందేశము
       ( ఆట వెలది)
      పరమ మక్షరంబు బ్రహ్మ; అధ్యాత్మ మ
       నంగ నెల్ల తనువులను గలట్టి
        ప్రత్య గాత్మ; భూత పటల జనుర్హేతు
          వైన మఖము కర్మ మనగ జెల్లు!
      ( గీతాదర్శము., 'తెనుగు లెంక' తుమ్మపల్లి సీతారామ మూర్తి., )

కామెంట్‌లు