ఇ అక్షర గేయం;-మచ్చ అనురాధసిద్దిపేట9948653223.
ఇదిగో పిల్లలు రారండి
ఇంటిని వదిలి రారండి

ఇక్కడ మీరు ఆడండి
ఇటుక గోడలు చూడండి

ఇసుక కుప్ప పై ఆడండి
ఇంకుడు గుంత చూడండి

ఇనుము ఒక లోహమండి
ఇంటికెంతో  అవసరమండి

ఇంతులంతా చదవాలండి
ఇంటికి వెలుగులు మీరండి

ఇగురం చక్కగ నేర్వండి
ఇతరులను గౌరవించండి

ఇతిహాసాలను  చదువండి
ఇనకుల రాముని కొలువండి


ఇమ్ముగ కలిసి ఉండండి
ఇంటికి చక్కగ వెళ్ళండికామెంట్‌లు