సంక్రాంతి పండుగ సందర్భంగా; -మచ్చ అనురాధ--సిద్దిపేట9948653223 .
సీసమాలిక

సాంప్రదాయకమైన సంక్రాంతి నాటికీ
పంటలింటికి జేరుపదిల
ముగను,
యింటి ముంగిళ్ళలో యింతులు వేసేరు
రంగుల ముగ్గులు రమ్యముగను,
గొబ్బెమ్మలను బెట్టి గోముగ నాడేరు
నవధాన్యములు తోడ నాంది పలికి,
హరిదాసులరుదెంచి యానందమొలుకంగ
కీర్తనల్  పాడంగ  కీర్తి పెరుగు,
గంగిరెద్దులవారు ఘనముగా యేతెంచ
సన్నాయి చప్పుళ్ళ సంబరాలు,
చూడ ముచ్చట గొల్పు చూపరులకునిల
గాలిపటములతో ఘనముగాను.

తేటగీతి

ఇంటి లోన జేసెడిపిండి వంటలన్ని,
మురుకులు చకిలాలరిసెలు ముద్దు గాను,
పెంచునారోగ్యమును , తిన్న ప్రీతితోడ,
మకర సంక్రాంతి పండుగ మనకు గొప్ప ‌.


కామెంట్‌లు
Unknown చెప్పారు…
సీస పద్యంలో సంక్రాంతి పండుగ గొప్పదనం చాలా చక్కగా వివరించారు 👌👌
అభినందనలు