నూతన ప్రణాళికలతో ఆంగ్ల సంవత్సరాది కి స్వాగతం. గుడిపూడి రాధిక రాణి
కత్తిలాగ కలము దూసి
కవితలు బాధ్యతగ వ్రాసి
చూపిస్తా సమాజాన్ని మార్చేసి
చూడచక్కని తెలుగు సున్నితంబు 

ఆరుద్రలా అందమైన పదాలు
శ్రీశ్రీలా మండుతున్న అక్షరాలు
సృజించాలి మెచ్చేలా కవితలు
చూడచక్కని తెలుగు సున్నితంబు 

కథలెన్నో వ్రాయాలని కోరికుంది
తపనతో కూడిన ఓపికుంది
కానీ ఆదివారమే తీరికుంది
చూడచక్కని తెలుగు సున్నితంబు 

సమయాన్ని సద్వినియోగం చేసుకుని
వృత్తిని ప్రవృత్తిని సరితూచుకుని
సామాజిక బాధ్యత నెరవేర్చాలని
చూడచక్కని తెలుగు సున్నితంబు

చరవాణిని మితముగా వాడాలి
పుస్తకాలు మరలమరల చదవాలి
జ్ఞానాన్ని సన్మిత్రులకు  పంచాలి
చూడచక్కని తెలుగు సున్నితంబు

కామెంట్‌లు