నూతన ప్రణాళికలతో ఆంగ్ల సంవత్సరాది కి స్వాగతం.డా.జి.భవానీ కృష్ణమూర్తి
నూతన వత్సరము వచ్చింది
ఆనందం అందరికి పంచింది
పగలు ప్రతీకారాలు వద్దంది
చూడచక్కని తెలుగు సున్నితంబు


క్లబ్బుల సంస్కృతి మనకొద్దు
మద్యంమత్తులు అసలే వద్దు
విచ్చలవిడిగా  తిరగ  వద్దు
చూడచక్కని తెలుగు సున్నితంబు

మాటలో మన్నన పెంచుకోవాలి
మంచి మర్యాద నేర్చుకోవాలి
నలుగురిలో గౌరవం పొందాలి
చూడచక్కని తెలుగు సున్నితంబు


తల్లిదండ్రులను ప్రేమతో సేవించాలి
పిల్లల ఆలనాపాలనా చూడాలి
బంధువుల మిత్రులను ఆదరించాలి
చూడచక్కని తెలుగు సున్నితంబు


కరోన విలయతాండవం చేస్తోంది
సరికొత్త వేరియంట్ వచ్చేస్తోంది
అందరిని జాగ్రత్తగా ఉండమంది
చూడచక్కని తెలుగు సున్నితంబు

కామెంట్‌లు