శంతనుడు. పురాణ బేతాళకథ.;-డా. బెల్లంకొండ నాగేశ్వరరావు.
 పట్టువదలని విక్రమార్కుడు శవాన్ని ఆవహించి ఉన్న బేతాళుని బంధించి భుజంపైనవేసుకుని మౌనంగా బయలుదేరాడు.
శవాన్నిఆవహించిఉన్నబేతాళుడు'మహారాజాశక్తి,జ్ఞానము,బలము,ఐశ్వర్యము,వీర్యము,తేజము వంటిఅష్టగుణసంపన్నుడవుఅయిననీవు నాకు ఉన్న సందేహంతీర్చాలి. శంతన మహారాజుగురించి వివరించు తెలిసి చెప్పకపోయావో మరణిస్తావు'అన్నాడు.
' బేతాళా మహాభారతంలో హస్తినాపురాన్ని పరిపాలించిన చంద్రవంశానికి చెందిన రాజు. భరతుడి వంశక్రమానికి చెందినవాడు. పాండవులకు, కౌరవులకు పూర్వీకుడు. హస్తినాపురానికి రాజైన ప్రతీపునికి వృద్ధాప్యంలో జన్మించిన కనిష్ఠ పుత్రుడు.
ఒకరోజు శంతనుడు గంగా నదీ పరిసర ప్రాంతాల్లో విహరించుచుండగా ఒక అందమైన కన్యను చూశాడు. ఆమెను వివాహమాడదలచి ఆమెను అనుమతి కోరాడు. అప్పుడు ఆమె తను ఏమి చెప్పినా ఎదురు చెప్పకుండా ఉండేటట్లయితే వివాహం చేసుకోవడానికి అభ్యంతరం లేదని షరతు పెట్టింది. అందుకు ఒప్పుకున్న శంతనుడు ఆమెను వివాహం చేసుకున్నాడు. కొంతకాలానికి ఆమె ఒక పుత్రునికి జన్మనిచ్చింది. ఆమె ఆ శిశువును గంగా గర్భంలో వదలి వేసింది. కానీ ఆమె పెట్టిన షరతును అనుసరించి ఏమీ అడగలేదు. కొంత కాలానికి మరో పుత్రుడు జన్మించాడు. ఆమె ఆ శిశువును కూడా అలాగే గంగార్పణం కావించింది. ఇలా ఏడుగురు పుత్రులను గంగలో వదిలి పెట్టింది. ఎనిమిదవ శిశువును కూడా ఆమె అలాగే ముంచివేయడానికి ప్రయత్నించగా కుతూహలం ఆపుకోలేని శంతనుడు ఆమెను ఎందుకలా చేస్తున్నావని ప్రశ్నించాడు. దాంతో ఆమె షరతుకు భంగం కలిగి ఎనిమిదవ శిశువును అలాగే బ్రతకనిచ్చింది. ఆ ఎనిమిదవ శిశువే దేవవ్రతుడైనాడు. తర్వాత భీష్ముడిగా పేరుగాంచాడు.
గత జన్మలో, ఇక్ష్వాకు రాజవంశానికి చెందిన మహాభిషుడు అనే శక్తివంతమైన రాజు ఉన్నాడు. మహాభిషుడు అనేక సద్గుణ లక్షణాలను కలిగి ఉన్నాడు. మహాభిషుడు వెయ్యి అశ్వమేథ యగాలు, వంద రాజసూయ యగాలు (చక్రవర్తిగా అర్హత సాధించిన తరువాత) చేసిన తరువాత, ఆయన మరణించిన తరువాత స్వర్గలోకం చేరుకున్నాడు. ఒకసారి ఆయనకు బ్రహ్మ ఆస్థానాన్ని సందర్శించే అవకాశం లభించింది. అక్కడ దేవతలు, ఋషులు అందరూ కూడా ఉన్నారు.ఋషులు, దేవతలు అందరూ బ్రహ్మను ఆరాధిస్తుండగా గంగాదేవి బ్రహ్మసభలో ప్రవేశించింది. ఆమె సభలో ప్రవేశిస్తున్న తరుణంలో ఒక గాలితరంగం వీచి, గంగాదేవి పైటచెరగు ఆమె శరీరం నుండి వైదొలిగింది. అది చూసిన సభికులలో మహాభీషుడు మినహా అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ తలలను వంచుకున్నారు. మహాభీషుడు మాత్రం ఆమెను కామంతో అలా చూస్తూనే ఉండిపోయాడు. ఈ చర్యను చూసిన బ్రహ్మ తన నిగ్రహాన్ని కోల్పోయాడు. ఆగ్రహించి, అతి పవిత్రమైన బ్రహ్మసభలో సభామర్యాద విస్మరించి కాముకంగా ప్రవర్తించినందుకు ఆయనను మనుష్యలోకంలో మానవునిగా జన్మించమని శపించాడు. ఈ చర్యను ఆస్వాదించిన గంగ మానవుడిగా తన కారణంగా శాపగ్రస్థుడైన మహాభిషుని వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుని భూలోకానికి బయలుదేరింది. మహాభిషుడు తాను భూలోకంలో ప్రతీప కుమారుడిగా జన్మించాలని కోరుకున్నాడు.
కురురాజు ప్రతీపుడు ఒకసారి గంగాతీరంలో ధ్యానం చేస్తున్న సమయంలో గంగా ఒక అందమైన మహిళ రూపాన్ని ధరించి రాజు దగ్గరికి వచ్చి అతని కుడి తొడ మీద కూర్చున్నది. ప్రదీపుడు ఆమెను చూసి ఏమి కావాలని అడిగగానే గంగ ప్రతీపుడితో తనను వివాహం చేసుకొమ్మని కోరింది. ప్రతీపుడు తాను భార్యమినహా ఎవరిపట్ల కామమోతుడు కానని ప్రతిజ్ఞ చేసానని అందువలన ఆమె కోరికను అంగీకరించలేనని, ఆమె తన కుడి తొడ మీద కూర్చుంది కనుక సంప్రదాయాల అనుసరించి ఆమె తనకు కుమార్తె లేదా కోడలు ఔతుందని, ఎడమ తొడ మీద కూర్చుంటేనే భార్య కాగల అవకాశం ఉంటుందని చెప్పి ఆమెను వివాహం చేసుకోవడానికి నిరాకరించాడు. అయినప్పటికీ ఆమె తన కుమారుని చేసుకుని తనకు కోడలు కావచ్చునని చెప్పాడు. అందుకు గంగాదేవి అంగీకరించింది.
ప్రతీపమహారాజుకు ఆయన భార్య సునందకు వారి వృద్ధాప్యంలో ఒక మగ బిడ్డ జన్మించాడు. కుమారుడు జన్మించిన తరువాత తన కోరికలను తపస్సు ద్వారా శాంతింపజేసాడు కనుక అతనికి ప్రతీపుడు శంతనుడు అని పేరు పెట్టాడు. ప్రతీపుడు అప్పుడు శంతనుడిని హస్తినాపుర రాజుగా నియమించి తాను తపస్సు చేయటానికి అడవులలోకి వెళ్ళాడు. శంతనుడి కంటే పెద్దవాడు అయిన బాహ్లికుడు కూడా శంతనుడికి హస్తినాపుర రాజు కావడానికి అనుమతి ఇచ్చాడు.
నాలుగు సంవత్సరాల తరువాత శంతనుడు యమునా ఒడ్డున ప్రయాణిస్తున్నప్పుడు తెలియని దిశ నుండి ఒక అద్భుతమైన సువాసన వచ్చింది. సువాసన కారణాన్ని వెతుకుతున్నప్పుడు ఆయన సత్యవతిని (యోజనగంధి) చూశాడు. ఆమె నుండి దివ్యమైన సువాసన వాసన వస్తోంది. సత్యవతి తన గ్రామంలోని మత్స్యకారుల రాజు దత్తపుత్రిక. ఆమెను చూడగానే శంతనుడు ఆమెతో ప్రేమలో పడ్డాడు. ఆమెను వివాహం చేసుకోవాలని కోరుకున్నాడు. సత్యవతి తన తండ్రి అనుమతిస్తేనే వివాహం జరుగుతుందని చెప్పింది. శంతనుడు మత్స్యరాజు వద్ద సత్యవతిని ఇమ్మని కోరిన తరువాత, సత్యవతి కుమారుడు హస్తినాపుర సింహాసనానినికి వారసత్వంగా పొందాలనే షరతుతో ఆమె తండ్రి వివాహానికి అంగీకరించాడు.
తన పెద్ద కుమారుడు దేవవ్రత సింహాసనం వారసుడు కావడంతో శంతనుడు రాజుపదవి గురించి తన మాట ఇవ్వలేకపోయాడు. అయినప్పటికీ దేవవ్రతుడు ఈ విషయం తెలుసుకున్నాడు.తన తండ్రి కోసం సత్యవతి పిల్లలకు అనుకూలంగా సింహాసనం మీద తన హక్కును త్యజిస్తానని మత్స్యరాజుకు మాట ఇచ్చాడు. సందేహాస్పద అధిపతికి భరోసా ఇవ్వడానికి సత్యవతి జన్మించిన భవిష్యత్తు తరాలను కూడా తన సంతానం సవాలు చేయకుండా చూసుకోవటానికి జీవితకాల బ్రహ్మచర్యాన్ని అనుసరిస్తానని కూడా ప్రతిజ్ఞ చేశాడు. ఈ ప్రతిజ్ఞ విన్న వెంటనే మత్స్యరాజు సత్యవతి, శాంతనుల వివాహానికి అంగీకరించాడు. దేవతలు ఆయన చేసిన ప్రమాణం కారణంగా ఆయనకు భీష్ముడు (భీషణ ప్రతిజ్ఞ చేసినవాడు) పేరు పెట్టారు. సత్యవతితో హస్తినాపురానికి తిరిగి వచ్చిన తరువాత ఆయన తన తండ్రికి చేసిన ప్రతిజ్ఞ గురించి చెప్పాడు. ఈ విషయం గురించి విన్న శంతనుడు భీష్ముని ప్రశంసించి కుమారుడు చేసిన త్యాగానికి ప్రతిగా భీష్ముడికి ఇచ్చామరణం (కోరుకున్న సమయంలో మరణించడం) ఒక వరంగా ఇచ్చాడు. శంతనుడికి, సత్యవతికి చిత్రంగదుడు, విచిత్రవీర్యుడు అనే ఇద్దరు కుమారులు పుట్టారు. శాంతనుడు మరణించిన తరువాత విచిత్రవీర్యుడు హస్తినాపుర రాజు అయ్యాడు. ఎందుకంటే శంతనుడు జీవించి ఉన్నప్పుడే చిత్రాంగదుడు అదే పేరు గల గంధర్వుడి చేత చంపబడ్డాడు.అంతరం సంతానహీనుడిగా క్షయవ్యాధికిలోనై విచిత్రవీర్యుడు కూడామరణిస్తాడు. సత్యవతి కోడళ్ళకు దేవర న్యాయంతో వ్యాసునిద్వారా ధృతరాష్టృ,పాండురాజు, విదురులు జన్మిస్తారు ' అన్నాడు విక్రమార్కుడు.
అతనికి మౌనభంగం కావడంతో శవంతోసహా బేతాళుడు మాయమై తిరిగి చెట్టుపైకి చేరతాడు.
పట్టువదలని విక్రమార్కుడు మరలా బేతాళునికై వెనుతిరుగుతాడు.


కామెంట్‌లు