నిత్య నూతనం జీవనం; -వెంకట రమణ రావు
 ప్రతి రోజు కొత్త రోజు
ప్రతి ఉదయం ఒక కొత్త వెలుగు
ప్రతి క్షణం కొత్త కోణం
ప్రతి స్పందన ఒక జీవన సంకేతం
చూసే కళ్ళకి ,వినే మనసుకే ఇది తెలుస్తుంది
జీవితాన్ని ప్రతి క్షణం కొత్త కోణం లో చూస్తే రంగుల హరివిల్లు  కనిపిస్తుంది
కష్టాలు సుఖాలు బాధలు భయాలు అన్నీ జీవన రంగోలి లో భాగాలే.
మానస నేత్రం తో హృదయ భావాలని చూద్దాము 
నిత్య నూతన జీవన అనుభూతిని  ఆస్వాదిద్దాము.

కామెంట్‌లు