లక్ష్యం;-డా. కమలా దేవి--కలంస్నేహం
జీవనగమనంలో ముఖ్యపాత్ర
గమ్యానిది, లక్ష్యానిది
సుగమంగా జీవితం సాగాలంటే
ఉండాలి ప్రతి ఒక్కరికి లక్ష్యం
ఏంచేయాలి, ఏంసాధించాలి
ఎక్కడికి చేరుకోవాలి
నిర్ణయించుకోవాలి
గమ్యం ముఖ్యం జీవనయానానికి
నిరర్ధకం గమ్యంలేని ప్రయాణం
నిష్ప్రయోజనం, నిరుపయోగం
అందుకే ఉండాలి సరియైన లక్ష్యం ప్రతిఒక్కరికి
నిర్ణయించుకోవాలి చేరవలసిన గమ్యాన్ని
ఏర్పరుచుకోవాలి కొన్ని లక్ష్యాలను
నిరంతరం కృషిచేయాలి లక్ష్య
సాధనకై
ఎదుర్కోవాలి గమ్యం చేరటానికి మధ్యవచ్చే అవాంతరాలను,ఆటంకాలను
పట్టుదల కృషి సాధనాలు కావాలి లక్ష్యసాధనకు
ఏర్పరుచుకోండి మీమీ లక్ష్యాలను
నిర్ణయించుకోండి చేరవలసిన
గమ్యాలను
కృషిచేయండి ఆదిక్కుగా
ఇస్తుంది ఫలాన్ని మీకు మీ శ్రమే
అడుగులు ముందుకు వేయండి గమ్యంవైపు
చేరండి మీ విజయతీరాలను
అధిరోహించండి విజయ సోపానాలను.


కామెంట్‌లు