నూతన ప్రణాళికలతో ఆంగ్ల సంవత్సరాది కి స్వాగతం. యం. వెంకట ధర్మారావు
 ఆంగ్ల సంవత్సరాది వచ్చిందోచ్ 
వన్నెలు ఎన్నో తెచ్చిందోచ్ 
కోటి సరదాలు పంచిందోచ్ 
చూడచక్కని  తెలుగు  సున్నితంబు !

ఉత్సాహంగా యువత కేరింతలు
ఊగుతు తూలుతు పడిలేస్తూ
హుషారుగా ఈలలు ఘోషలతో
చూడచక్కని తెలుగు సున్నితంబు !

మనసును నిదుర పోనివ్వదు
మదిన యోచన చేయనివ్వదు
అర్ధరాత్రి సంబరాలు హోరెత్తిస్తాయి
చూడచక్కని  తెలుగు  సున్నితంబు

సరిక్రొత్త వెలుగులు రానున్నాయి
గతమున స్మృతులు మరువకున్నాయి
ఉత్తేజితమై చేసుకుందాం సంబరాలు
చూడచక్కని తెలుగు సున్నితంబు

ఆంగ్ల వత్సరాది వెలుగులు
వన్నే తేబోవును జీవితాలకు
స్వాంతనము చెందెను హృదయాలు
చూడచక్కని తెలుగు సున్నితంబు!

కామెంట్‌లు