*కరోన మహమ్మారి* *(కందములు)*;-*మిట్టపల్లి పరశురాములు*
భద్రముగనుండుమెప్పుడు
భద్రములేకున్నకరోన-బట్టియుమ్రింగున్
భద్రమెమనకిలసౌఖ్యము  
భద్రతలేకనుజనములు-బలియైపోవున్

కంటికికనబడనితెగులు
జంటగతిరిగాడుచుండె-జాగ్రతనెపుడున్
కంటకమునందునచిక్కక
నింటిలొనుండగకరోన-నిలలోతొలుగున్

ముక్కు మూతికి మాస్కులు
చక్కగ ధరించి కరములు-చకచక కడగన్
పక్కకుతొలుగును తెగులును
నిక్కమునీదరికరోన-నిలువదురామా!

విందులకెళ్ళకు సోదర
సందులచాటుతిరిగాడు-సతతమొమీక్రాన్
బంధములను తెంచునుసుమి
వందనములుజేయుచున్న-వదులుమువిందుల్

కలుపకుచేతులుచెలులకు
కలువకుతెలియనిమనుజుల-కలవరమొందున్
తొలగను గుంపులసమమును
తొలుగునుమనకిలకరోన-తొందర రామా!
                   ***


కామెంట్‌లు