*మహిళామణుల్లో మరకతమణి*;-: అన్నాడి జ్యోతి*సిద్దిపేట
 (సావిత్రీబాపూలే జన్మదినం సందర్భంగా)
-------------------------------------------------
పల్లవి:
మహిళా లోకానికీ, విద్యావిలువలు తెలిపిన
మరకతమణివమ్మనీవు మహిళామూర్తీ...
అభినందనమందార మాలలమ్మా నీకు
అందుకొనుము వందనములు సావిత్రమ్మా ...
చరణం-1
బాలికలకు విద్య బహుదూరముగనున్న
చెంతచేర్చి చదువు చింతబాపితివమ్మ
ఆడపిల్లలంతా అక్షరాస్యులయినా
ఇంతిచదువుకున్న ఇల్లంత కాంతియై
దేశమంతవెలుగురా దేదీప్యమానమయ్యీ.....
         !!మహిళాలోకానికీ!!
 చరణం-2
ఆడపిల్లలంతా అన్నిరంగాలలో
దూసుకెళ్ళూతుండ్రు  దునియాదిరుగూతుండ్రు
వైద్యురాలు అయినా....ఉపాధ్యాయురాలు అయినా..
కలెక్ట‌రయ్యిన. కండక్ట‌రయ్యిన
చదువుకున్న వారికే సకల ఉపాధులమ్మా...
       ‌     
          !!మహిళాలోకానికీ!!
చరణం-3
నీవుపెట‌్టినట‌్టీ చదువుబిక్షేనేడూ
మహిళాలోకానీకి మణిహారమయ్యింది
జ్ఞానదాతవమ్మా..నీదు ఋణముదీర్చలేమూ....
సావిత్రమ్మ నీదూ..కృషినిమరువలేము 
ఎన్నడూ....
 మాకుమార్గదర్శివమ్మా ...నీవు స్ఫూర్తిప్రదాతవే....🙏🙏
     !!మహిళాలోకానికీ!!
   
        

కామెంట్‌లు