నడిచే దేవుడు;-- యామిజాల జగదీశ్
 తమిళనాట నలభై ఏళ్ళుపైగానే వక్తగా కొనసాగుతున్న సుకీ శివం నా కాలేజ్ మేట్. మద్రాసు వివేకానందా కాలేజీలో ఇద్దరం బి.ఎ. ఎకనామిక్సులో క్లాస్ మేట్స్ మి. డిగ్రీ తర్వాత అతను లా చదివి డిగ్రీ పొందినా వక్తగానే తన జీవితాన్ని కొనసాగిస్తున్నారిప్పటికికూడా.
అతను ఏ అంశంపైనైనా ప్రత్యేకించి ఆధ్యాత్మిక అంశాలపై అమోఘంగా మాట్లాడగల దిట్ట. అతని ప్రసంగాలు నాకెంతో ఇష్టం. 
ఈరోజు మధ్యాహ్నం అతని ఉపన్యాసం ఒకటి విన్నాను. 
కంచి పరమాచార్య గురించి చెప్పిన విషయమది.
ఆయనొకమారు పల్లకీలో వెళ్తుండగా ఓ సామాన్యుడు వేసిన ప్రశ్న ఆయనను ఆలోచనలో పడేసింది. ఆ ప్రశ్నేంటంటే...
"ఈయనా మనలాగా మనిషేగా...ఈయన పల్లకీలో దర్జాగా కూర్చుంటే తోటి మనుషులు మోయాలా? ఈయన మనకు అవీ ఇవీ చెప్పడమేంటీ?" అని.
ఈ మాట చెవిన పడటంతోనే కంచీ పరమాచార్య అప్పటికప్పుడు పల్లకీ ఆపించి అక్కడ దిగిపోయారు. ఇక ఈ క్షణం నుంచీ తాను ఎక్కడికైనాసరే నడిచే వెళ్తాను. ఏ వాహనమూ ఎక్కను. ఎంత దూరమైనా సరే నా రెండు కాళ్ళే నా వాహనం" అన్నారు. ఎవరో ఏదో అంటే మీరిలాటి నిర్ణయం తీసుకోవడమేంటీ అని దగ్గరున్నవారన్నా విన్పించుకోలేదు. తను నడిచే వెళ.తానన్నారు పరమాచార్య.
ఆ మాటకు కట్టుబడే తుది శ్వాస వరకూ కొనసాగారు. వయస్సు మీదపడి నడవలేని స్థితిలోనూ ముందర రిక్షా పోతుంటే దాన్న ఆసరాకోసం పట్టుకుని నడిచేరే తప్ప పక్కనున్న వారు ఎక్కమన్నా రిక్షా ఎక్కలేదు 

కామెంట్‌లు