సునంద భాషితం;-వురిమళ్ల సునంద,ఖమ్మం
 మళ్ళీ వచ్చే బాల్యాన్ని..
*******
బాల్యం అపురూప వరం.
అందరినీ అలరిస్తుంది.అమాయకత్వంతో ఆదరింపబడుతుంది. ముద్దు మురిపాల ఊయలూగుతుంది.
అదే బాల్యం మళ్ళీ వస్తే...
అయిన వారి అసహనం,అనాదరణ, నిర్లక్ష్యంతో కాకూడదు శాపం
అదుపులో లేని అవయవాలతో,అవసరాలకు ఇతరులపై ఆధారపడేలా వచ్చిన మరో బాల్యానికి  బ్రతకడమే భారం కావద్దు భారం
మన జన్మకు మూలమైన,అనుభవాల పాఠాలు చెప్పిన గురుతుల్య బాల్యాన్ని
ఆత్మీయంగా అక్కున చేర్చుకుందాం.
ఆఖరి మజిలీని ఆనందమయం చేద్దాం.
మకర సంక్రమణ ప్రభాత కిరణాల నమస్సులతో🙏

కామెంట్‌లు