అభిమన్యునిశౌర్యం.పురాణ బేతాళ కథ.;- డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై

 పట్టువదలని విక్రమార్కుడు మరలా బేతాళుని బంధించి భుజపనవేసుకుని మౌనంగా నడవసాగాడు.
'మహారాజా పట్టుదలకు మారుపేరైన నిన్ను అభినందిస్తున్నాను పుణ్యము,న్యాయము,సామ్యము,స్వభావము,ఆచారము,అహింస,వేదోక్తవిధిఉపనిషత్తు,యజ్ఞము వంటినవధర్మాలు తెలిసిననీవు  అభిమన్యుని గురించి నాకు తెలియజేయాలి తెలిసి చెప్పకపోయావో మరణిస్తావు'అన్నాడు బేతాళుడు.
' బేతాళా పూర్ణగర్బవతిగా ఉన్న సుభద్ర కు పద్మవ్యూహంలో ఎలా ప్రవేశించాలో వివరిస్తూన్నాడు అర్జునుడు సుభద్ర నిద్రించడంతో, ఆమెగర్బంలోని శిశువు అభిమన్యుడు ఊ కొట్టసాగాడు.అకస్మాత్తుగా అక్కడకు వచ్చిన శ్రీకృష్ణుడు'బావా ఎవరితోమాట్లాడుతున్నావు, సుభధ్ర నిద్రపోతుంది కదా'అనిఅర్జునుని పద్మవ్యూహం గురించి పూర్తిగా చెప్పకుండానే అక్కడనుండి తీసుకువెళ్ళాడు. అనంతరం అభిమన్యుడు బలరామదేవునికుమార్తే శశిరేఖను శ్రీకృష్ణుని ఆశీర్వాదంతో,ఘటోత్కచుని సహాకారంతో వివాహం చెసుకున్నాడు.అనంతరం విరాటరాజు కుమార్తే ఉత్తరను పరిణయం ఆడాడు.అమె గర్బవతిగా ఉన్నసమయంలో యుధ్ధంరావడంతో తన తండ్రికి తోడుగా పాండవ వీరుడుగా యుద్ధరంగంలో పాల్గోన్నాడు. కురుక్షేత్రసంగ్రామంలోఅర్జునుడుసంశప్తకులతోదూరంగాపోరాడుతున్నసమయంలో భరద్వాజుడు పద్మవ్యూహం పన్నాడు,అదిచూసినధర్మరాజు'నాయనా అభిమన్యు నీ తండ్రి అర్జునుడు,శ్రీకృష్ణుడు,ప్రద్యుమ్నుడు మాత్రమే దీనిలోనికివెళ్ళగలరు 'అన్నాడు.పెదతండ్రిగారుపద్మవ్యుహంలోనికివెళ్ళడంనాకుతెలుసుకాని,తిరిగిరావడం తెలియదు'అన్నాడు అభిమన్యుడు.'నీవు పద్మవ్యూహంలోనికివెళ్ళ గలిగితే నీవెనుకే మన పాండవ వీరులతో నేనూవస్తాను'అన్నాడుధర్మరాజు.
ద్రోణునితనశరాలతోనొప్పించిపద్మవ్యూహంలోప్రవేశించినఅభిమన్యుని,కృపుడు, అశ్వత్ధామ,కర్ణ,శల్య,దుశ్యాసన,దుర్యోధనులతోద్రోణుడుచేరి,అభిమన్యుని చుట్టుముట్టారు.తనశరపరంపరలతోవారినినిలువరిస్తూ,'అశ్మికుని'శిరస్సుఖండించి,కర్ణునినొప్పించి,శల్యుని మూర్చపోయేలాచేసి,శల్యునితమ్మునియమపురికి పంపాడు.అలాయుద్ధంచేస్తున్నఅభిమన్యునిపోరుకుకౌరవసేనలువెనక్కుతగ్గాయి. అతని వీరత్వానికి రణభూమి దధ్ధరిల్లింది. పాండవులు,వారిసేనలు ఎవరు పద్మవ్యూహంలోకిరాకుండా సైంధవుడు శివుని వరంతొ అడ్డుకున్నాడు.   నేలకొరిగేవారిహాహాకారాలు,గాయపడినవారిమూలుగులు,దాహార్తులకేకలు,విరిగేవిల్లులు,ఒరిగేరధాలు,తునిగేఖడ్గలు,నలిగేడాలులు,తూలేసారధులు,కూలేఏనుగుల ఘీంకారాలు,వాలేథికులు, పడేకాల్బలము,చెడేగుర్రాలు ,అలల తరంగిలుగా తనశరాలతో విజృభిస్తున్న అభిమన్యునిచూసి ద్రోణుడుఆశ్చర్యచకితుడుఅయ్యాడు. 'ఇతన్నినిలువరించడం ఎలా'అన్నాడు కర్ణుడు.'కవచవిద్య తనతండ్రివద్ద నేర్చాడు ఇతని శరీరంపై అదిఉన్నంతవరకు ఏమిచేయలేం'అన్నాడు ద్రోణుడు.'వంచనమార్గంలోవిల్లుతుంచి,విరథునిచేసి,కవచాన్నిఛేదిద్దాం'
అన్నాడు.
దూరంగాఅర్జునుని దేవదత్తం,శ్రీకృష్ణుని పాంచజన్యం శంఖారావాలు విజయసూచికంగా వినిపించడంతో,ఉత్సహభరితుడైన అభిమన్యుడు దుర్యుధనుని కుమారుడైన లక్ష్మణ కుమారునితో తలపడి అతని తల తుంచాడు.అదిచూసినకౌరవసేనలు  భయంతోఆహాకారుచేసాయి.
వెనువెంటనే శల్యుని కుమారుడు రుక్మాంగదునితోతలపడి అతనికి మరణాన్ని ప్రసాదించాడు.
అభిమన్యుని రధంవెనుకకువెళ్ళినకర్ణుడు,తనబాణంతోఅతనిధనస్సు ఖండించాడు.అదేసమయంలో ఆచార్యుడు అశ్వాలనుకూల్చాడు.కృపుడు సారధిని సంహారించాడు.శకుని దొంగచాటుగా అతనికవచాన్నిఛేదించాడు.  అలా నిరాయుధుడు,విరథుడు అయ్యడు అభిమన్యుడు.కత్తి డాలు చేతబట్టి కనిపించిన వారిని యమపురికి పంపుతున్న అభిమన్యుని దొంగదెబ్బతీస్తూ కత్తి డాలు వెనుకనుండి ఛేదించారు. అందుబాటులోని రథచక్రంతో అందినవారిని హతమారుస్తున్న అభిమన్యుని, శకుని, కర్ణుడు,కృపుడు,కృతవర్మ,శల్యుడు ఆ రధచక్రాన్నిఛేదించారు. అందుబాటులోని కత్తితో ఇరవై ఏడుమంది గాంధార వీరులను,పదిమంది వసతీయులును,ఆవేశంగాముందుకువచ్చిన దుశ్యాసనుని కుమారుడను సంహరించి క్షణకాలంఅలసటగా నిలబడిన అభిమన్యుని కౌరవ దుష్టచతుష్టయం మూకుమ్మడిగా దాడిచేసి హతమార్చారు. ఆదారుణాన్ని చూడలేక సూర్యుడు పడమటి కనుమల్లోకి వెళ్ళిపోయాడు  'అన్నాడు విక్రమార్కుడు.
అతనికి మౌనభంగం కావడంతో శవంతో సహామాయమై మరలా చెట్టుపైకి చేరాడు బేతాళుడు.
పట్టువదలని విక్రమార్కుడు మరలా బేతాళునికై వెనుతిరిగాడు.
కామెంట్‌లు