అన్నమయ్య సూక్తులు.; -తాటి కోల పద్మావతి గుంటూరు.

 1. తినక చేదును తీపి తెలియనే రాదు.
2. చింతలేని అంబలి ఒక్కటి చారెడే చాలు.
3. పరా పీడ సేయు కంటే పాపము మరి ఎందు లేదు.
4. పరోపకారము కంటే బహు పుణ్యము లేదు.
5 సుఖమును దుఃఖమును జోడు కోడెలు.
6. ఏ పురాణములను ఎంత వెతికినా శ్రీపతి దాసులు చెడరు ఎన్నడును.
7. కుమ్మరి వాడు లేకుండా కుండ తా పుట్టినా.
8. ఒక విత్తు పెట్టితే వేరొక టేల మొలచును.
9. దిక్కులేని వారికి కెల్లా దేవుడు దిక్కు.
10. సిరు లెన్ని గలిగినను చింతలే పెరుగు.
11. అతి కోప మేడ ఉండు అజ్ఞాన మాడ నుండు.
12. గోడ కడుగగా పోతే కొన దాకా కంపే.
కామెంట్‌లు