. జ్ఞాపకాలు;-ములస్తం లావణ్య;-కలం స్నేహం
 నిశ్శబ్దం నిండిన సంద్రాన్ని చూస్తూ
ఇసుక దిబ్బలపై కూర్చుని
వెన్నెల వానలో తడిపోతున్న వెన్నెలకి...
జ్ఞాపకాల పొంగులు పాలపొంగుల పొంగే...
తన ఊరు గురుతుకొచ్చే...
గోరుచిక్కుడు కాయ కూర కలిపి అమ్మ తింపించిన గోరు ముద్దలు....
యంత్రం లాగా పనిచేసి సాయంత్రం ఇంటికి వచ్చిన నాన్నను చూడగానే పట్టలేని ఆనందం....
నాన్నమ్మ చేసిన చింతకాయ పచ్చడి ఊరించుకొంటు తింటూ
చింతలు లేని రోజులు...
పంట పొలాలు ఇంటి నిండా పాడిపంటలు...
పాలిచ్చే గోమహా లక్ష్ములు
గాదెలలో ధాన్య లక్ష్ములు....
జానపదులు పాడుకొనే 
జానపద గీతాలు శ్రావ్యంగా వినిపించే
మేఘాల పల్లకిలో సాగే పల్లవులు రాగాలు తీసే...
చిలకపచ్చని కోక గట్టిన కొమ్మలపై
వాలిన చిలుకల గుంపులు .....
సీతాఫలచెట్టుపై వాలిన సీతాకోక చిలుకలు....
గాజుల గలగలలా సెలయేటి గలగలలు...
ఎంత మధురమో దూరమైన జ్ఞాపకాలు.

కామెంట్‌లు