: నీ జ్ఞాపకాలతో;-పోలగాని.భానుతేజశ్రీ;-కలం స్నేహం
ఆశలన్ని ఆవిరైన ఆ క్షణాన మిగిలాను మోడుగా
నవ్వులన్నీ నన్ను చూసి వెక్కిరిస్తూ ఉంటే  మాటలే ముగబోయాయి.... 

మౌనాన్ని గుండెల వెనుక దాచి మనసు విరిగిన మనుషిలా మిగిలాను
జ్ఞాపకాల కౌగిల్లో కన్నీటి రోధన లో కాలాన్ని గడుపుతున్నా.... 

కన్నీరు కూడా రాను అంటుంది నన్ను చూసి
ప్రతి క్షణం ఆకాశంలో ఎగిరే నా మనసు అకస్మాత్తుగా కూలబడిపోయింది.... 

నీ జ్ఞాపకాల కుంపటి లో కన్నీటిని కాచుకుంటున్నా
ఈ బాధల అగ్నికి నన్ను నేను  ఆహుతి చేసుకుంటున్నా..... 

నడిరాతిరి గుర్తొచ్చే నీ జ్ఞాపకాలు  నా మనసుని చెల్లాచెదురుగా చేస్తున్నాయి
మైమరపే రాని నీ చిరునవ్వులు ప్రతి క్షణం నన్ను వేధిస్తూనే ఉన్నాయి.... 

నా ప్రతీ కన్నీటి చుక్క నన్ను ప్రశ్నిస్తూనే ఉంది
కాలానికి నిన్ను పరిచయం చేసి వదిలిన వారి కోసం విలువైన నన్ను బయటికి తీసుకురావడం అవసరమా అని.... 


కామెంట్‌లు