రావా చెలి; -ఇచ్టిన పదాలు;-సంధ్యా కుమారి వై;-

 ఎన్నెన్ని సార్లు నీ చెంత
నేనుండగ నీ తేనెలొలుకు
మాటలు నాకు గుభాళించే గులాబీలులేదు తనివితీరా నేను మరెన్ని సార్లు ఆస్వాదించ లేదు .ఇప్పుడు ఎందుకో ప్రియా గులాబి తోట చెంతనే వున్నా
వెన్నెల చల్లదనం అలరిస్తున్నా
నీవు లేక మధురానుభూతి లేదు
 చురకత్తుల చూపులు నన్ను తాకి నన్ను నిలువ నీయకుంటువి. ఆ వలపు చూపులలో నేను తడిసి ముద్దవ్వాలని నా మది 
వువ్విళ్ళూరుతున్నది కళ్ళల్లో కోటి కాంతులునింపుకుని ఎదురు చూస్తున్నా మన ఇద్దరి నడుమనున్న మౌనాలు దూదిపింజల్లా
ఎగిరిపోయి నీ సాంగత్యంలో హృదయవీణలు మ్రోగించగా రావా సాయం సంధ్యా క్రాంతిలో ఇసుక తెన్నులపై మరో మారు 
ముద్దుగుమ్మలముచ్చట్లు పంచగా రావా చెలి

కామెంట్‌లు