మొయిజ్!...అచ్యుతుని రాజ్యశ్రీ

 ఇది ఒక పురాగాథ.ఆరాకుమార్తె  వెదురుబుట్టలో ఓపిల్లాడిని తీసుకుని వచ్చింది. "పసివాడి ని చూశాక మా నాన్న  ఇంక ఏ యూదు జాతి (జ్యూజాతి)పిల్లల ను చంపడు"అని భావిస్తుంది.వాడి ని ఒడిలోకి తీసుకోగానే ఆమెని పీడిస్తున్న కుష్టు వ్యాధి మాయమై పోయింది. అప్పటి నించి  ఆరాకుమార్తె ను అంతా దేవుని బిడ్డ గా భావించారు. ఆచిన్నారిని అంతా మొయీజ్ అని పిలవసాగారు.ఒకసారి వాడి ని  రాజు ఒడిలో కూచోపెట్టుకుని ఆడిస్తున్నప్పుడు వాడు రాజు కిరీటాన్ని చేతుల తో పట్టి కింద పడేస్తాడు.అసలే రాజు కి మూఢనమ్మకాలు ఎక్కువ. తన ప్రాణం పదవికి వీడు ఎసరు పెడతాడని భావించి మతపెద్దలు పురోహితులను పిల్చి సలహా అడుగు తాడు."రాజా!ఈబుడత వల్ల  మీకు అసలుకే మోసం! తిన్న ఇంటికి వాసాలు లెక్క పెట్టే వీడిని వెంటనే చంపండి"అని అంతా అంటారు. కానీ ఒక గురువు ఇలా అన్నాడు "రాజా!నిదానం ప్రధానం. తొందర పడకండి. వీడి బుద్ధి  మనసు ని పరీక్షించండి.ఒక పాత్రలో కణకణలాడే నిప్పులు ఇంకో పాత్రలో బంగారు నాణాలు వేసి పాపడిముందు పెట్టండి. వాడు నిప్పు పాత్ర లో చెయ్యి పెడితే  మెరిసే వస్తువు లంటే వాడికి ఇష్టం అని  బంగారు నాణాలపాత్రలో చెయ్యి పెడితే మీరాజ్యం కబళిస్తాడని గ్రహించండి. అప్పుడు వాడి ని చంపండి."రాజు కి ఆమాట నచ్చింది. అలాగే చేశాడు. ఆచిన్నారి మొదలు బంగారు నాణాలపాత్రలో చెయ్యి పెట్టబోతుండగా ఏదో అదృశ్య శక్తి  వాడిచేతిని నిప్పుల పాత్రలో పెట్టించింది.వాడు నిప్పు కణిక ను నోటి లో పెట్టుకున్నాడు. పాపం నాలుకకాలి జీవితాంతం నత్తినత్తిగా మాట్లాడే వాడు.ఈవిషయం తెలుసుకున్న యూదులు ఏమనుకున్నా రంటే"మనకు ముక్తి అనేది ఆ పరమాత్మ పై ఆధారపడి ఉంటుంది. "అని. 
ఇక ఆదిమానవుడికి దేవుడు ఓ కర్రను ఇచ్చాడు. అతనికి చావు సమీపించి నపుడు మహాప్రళయసమయంలో నోవ్ ఆపై అబ్రహం  ఆతరువాత జోజఫ్ కి ఆకర్ర లభించింది. జోజఫ్ చనిపోయాక ఆకర్ర తన శక్తిని కోల్పోయింది. జెథర్ అనే మాంత్రికుడు ఆకర్ర ను తోటలో పాతేస్తాడు.ఆకులు లేని చెట్టులా ఉన్న దాన్ని ఎవరూ పెకలించలేరు.అతని కూతురు సాపహోరా ప్రతిన బూనుతుంది"ఈకర్రను పెకలించినవాడినే నేను పెళ్ళాడుతాను." ఇదివిన్న మొయీజ్  తోటలో కి వచ్చి ఆకర్ర పై చేయిపెట్టగానే హిబ్రూ భాషలో దేవుని పేరు కనపడింది. సాపహోరా ని పెళ్ళి చేసుకుని అత్తగారి ఇంట్లో మేకలని కాసేవాడు.ఈజిప్టు లో కర్రసాయంతో తోటివారిని బానిసత్వం నించి కాపాడాడు.ఇజ్రాయిల్ లో వారి కి  నివాసం ఏర్పాటు చేశాడు.దైవకృపవల్ల అతను యూదుల ఉద్ధారకుడు అయ్యాడు.అతని ఆత్మ  బలం ధైర్యం ఇస్తుంది అని యూదు జాతి జనుల నమ్మకం.  ఈకథ చదివాక మన కుంతీదేవి కథ రాకుమార్తెల స్వయంవరం జలప్రళయం సత్యవ్రతరాజు  కంసుడు పిల్లలని చంపటం గుర్తు వస్తుంది కదూ?
కామెంట్‌లు