ఫిన్ సాహసం! అచ్యుతుని రాజ్యశ్రీ

 ఇది ఐర్లాండ్ జానపద గాథ.ఏదేశసైన్యం ఐనా దేశభక్తి వీరత్వం  సాహసం ధైర్యం కలిగిఉంటేనే ఆదేశం సుభిక్షమౌతుంది.మన రాజుల చరిత్రలాగానే ఐర్లాండ్ రాజు ఎరిన్ పాలనలో జరిగిన ఘటన ఇది.అతని సేనాని కోల్ నూరుయుద్ధాలు చేసి రాజు ని కాపాడాడు.కానీ ప్రతిమంచివాడికీ ఓఅసూయాపరుడైన శత్రువు ఉంటాడు. గోల్అనే వాడికి నిలువెల్లా విషం!కడుపులో మంట అసూయ!కోల్ అంటే ససేమిరా పడదువాడికి.తనకంటూ ఓదుష్టముఠాని ఏర్పాటు చేసుకుని కోల్ కి గట్టి దెబ్బతీసి ఒంటరిగా వేటకివెళ్లిన అతని ని చంపేశాడు.ఇక చేసేదేమీ లేక రాజు  గోల్ ని సేనాపతి గా నియమించాడు.తన చిన్నారి కొడుకు ని రక్షించడానికి కోల్ భార్య అడవిలో అజ్ఞాతవాసం చేస్తోంది. ఆమెకి ఇద్దరు ఆటవిక స్త్రీలు తోడు నీడగా అండదండలతో నిలిచారు. ఆచిన్నారి ఫిన్ యువకుడై అన్నిరకాల యుద్ధవిద్యలలో ఆరితేరాడు.తనతండ్రి చావుకి ప్రతీకారం తీర్చుకోడానికి ఫిన్…కొన్నాళ్ళకి ఓరాక్షసుడు రాజమహల్ లోకి వచ్చాడు.వాడికి కొమ్ములు న్నాయి.కళ్ళు చింతనిప్పుల్లా మండుతున్నాయి.ప్రతివస్తువునీ విసిరేసి చిందరవందరచేయసాగాడు.వాడిదగ్గర ఓవాయిద్యం ఉంది. దాన్ని వాయించగానే ఎక్కడివారు అక్కడే రాయిలా బిగుసుకుపోయారు."రాక్షసుడిని చంపిన వాడికి గొప్ప బహుమతి ఇస్తాను "అని రాజు ప్రకటించాడు. "రాజా!నేను తప్పక ఆరాక్షసుడి పీడా వదిలిస్తాను"అని తన దగ్గర ఉన్న మంత్రపూరిత త్రిశూలంతో రాక్షసునిపై దాడి చేశాడు.వాడిచేతివాద్యపు మోతకి త్రిశూలంలో రెట్టింపు శక్తి వచ్చింది. ఫిన్ వాడిపై దాన్ని విసరటంతో వాడు ఆకాశంలోకి పెద్దగా అరుస్తూ ఎగిరి పోయాడు.వాడిపీడా వదిలింది.రాజు  ఫిన్ ని తన సర్వసేనాధిపతిగా చేశాడు 🌷


కామెంట్‌లు