గీతాంజలి ; -రచయిత, చిత్రకారుడు : జింకా రామారావు
 56." నీ కరుణ నాలో ప్రతిఫలించనీ” నీ కరుణ నాలో ఇలా ఫలవంతమైంది. అందుకే నాకోసం ఇలా నీ అగ్రాసనాన్ని దిగివచ్చావు. ప్రభూ.... సర్వలోకేశ్వరా.. నేనే లేనట్లయితే నీ కరుణంతా ఏమై ఉండేది? నీ సకల సంపదలకు నన్ను వారసుడిగా తీసుకున్నావు. నా హృదిలో నిరంతర జీవనక్రీడలాగా తాండవిస్తుంది నీ కృప. నా జీవితంలో నీ సంకల్పం నూతన ఆకృతులను పొందుతుంది. అందుకే లోకేశ్వరుడవైన నీవు నా హృదయాన్ని నీ ఆధీనంలో వుంచుకోవడానికై నీ అలంకరణల సౌందర్యంతో సమ్మోహ పరచ జూస్తున్నావు. అందుకే నీ ప్రేమ నీ ప్రియురాలి ప్రేమలో విలీనమై ఆ ఏకత్వంలో “నీవు” వ్యక్తమౌతావు.

కామెంట్‌లు