సునంద భాషితం;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 మరుపు మంచిదే
*******
కాలం చేసిన గాయాలకు మరుపు  ఔషధం లాంటిది.మరుపు లేనిదే జీవితం ముందుకు సాగలేదు.
మాతృమూర్తి బిడ్డకు జన్మనిచ్చే సమయంలో మృత్యువు అంచుల దాకా వెళుతూ పడ్డ శారీరక బాధ మళ్ళీ ఇంకొక సారి పడొద్దని అనుకుంటూనే,ఆ బాధలను మరచి మరో బిడ్డకు జన్మనిస్తుంది.
అలాగే గతంలో అనుభవించిన కష్టాలు, బాధలు, తప్పిదాలను  మరిచిపోగలిగితేనే..
వర్తమానాన్ని  కొంతైనా  ఆస్వాదించగలం.
భవిష్యత్తును ఆనందమయం చేసుకునేందుకుప్రయత్నించ గలం.కాబట్టి మరుపు మంచిదే...
 ప్రభాత కిరణాల నమస్సులతో🙏

కామెంట్‌లు