గీతాంజలి -- రచయిత, చిత్రకారుడు : జింకా రామారావు
 54. " దాహంగొన్న బాటసారి " నీ నుంచి నేనేమీ కోరటంలేదు, నా పేరైనా నీ చెవిన వేయలేదు. నువ్వు తరలివెళ్ళే వేళ నేను మూగనైయాను. బావిగట్టు చెంతన నేనొంటిగ నిలుచున్నాను. అతివలు చెట్టువాలు జలభరిత అరుణ పాత్రలతో నీడలో ఇళ్ళకు మళ్ళారు. పొద్దు నడినెత్తికి చేరింది. నువ్వూ రారమ్మని నా చెలులు నను పిలుస్తున్నారు. ఐనా...... నిలిచిపోయాను. నేనిక్కడే ఏవేవో కలలుగంటూ, నీ ఆగమనమనాన్ని గమనించలేదు నీ పదసవ్వడి, నీ చూపుల్లో దీనత, మాటల్లో అలసట నిండగా “నేనో దాహంగొన్న బాటసారిని” అన్నావు. నేనొక్క ఉదుటున కలలనుంచి మేల్కొన్నాను. నా పాత్రనుంచి నీరు నీదోసిటిలో నింపాను. చెట్ల ఆకుల గలగలల మధ్య కనపడని కోయిల కుహూ....కుహూ మన్నది. మలుపులోని బాబ్లా పూల ఘుమ, ఘుమలు దారంతా నిండాయి. బిడియాన మాట బయటికు రాలేదు. నా పేరేమని నువ్వు ప్రశ్నించినప్పుడు నీకై చూడలేకపోయాను. కానీ.....

నీ దాహ నివృత్తికై నీరు ఇచ్చానన్న జ్ఞాపకం నా హృదయంలో మధురిమగా నిలవటం నేను మరువ లేను. చాలా ప్రొద్దెక్కింది... అలసినస్వరంతో పక్షి కూస్తుంది, నేను కూర్చుని అదే పనిగా ఆలోచిస్తున్నాను.
 

కామెంట్‌లు