గీతాంజలి;-రచయిత, చిత్రకారుడు : జింకా రామారావు
 53. " జీవన మృత్యుహేల"
చావు పుట్టుకలు రెండూ కవల పిల్లలవంటివని, ఆ రెంటిచేత కౌగిలించుకోబడిన ఆటతో ప్రపంచం క్రీడానందంలో మునిగివుందని, ఇది ప్రాణికోటిని సంతోషాల ఊయలమీద కేరింతలు కొట్టిస్తూ, వాటికి మేలుకొలువు పాడటమే కాకుండా మృత్యువనే కంబంధహేలతో వారిని తనలో ఇముడ్చుకునే ఆనందం అంటూ నిత్య సత్యమైన సృష్టి క్రీడను మనకళ్ళముందుంచుతున్నాడు.
ఈ విశ్వకల్యాణ ఆనందరాగాలలో భాగంగా పచ్చదనంతో ఈ భూమిని ప్రాణప్రదం చేయటం, ఉదయాన్నే విచ్చుకున్న కమలం మీద మిలమిలా మెరిసేవి ఆయన ఆనందభాష్పాలని, ఈ సృష్టి కోసం తనదైన దాన్నంతటినీ దుమ్ములో విరజిమ్మి ఫలితం చూసి ఆనందించటానికి ఆ సర్వేశ్వరుడు మౌనముద్రకు ఉపక్రమించటం కూడ ఆయన ఆటలో భాగమేనని రవీంద్రుడు అంటున్నాడు.

కామెంట్‌లు