కురు వంశం . పురాణ బేతాళ కథ.;-డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

  పట్టువదలని విక్రమార్కుడు చెట్టుపైన శవాన్ని ఆవహించి ఉన్న బేతాళుని బంధించి భుజంపైన వేసుకుని మౌనంగా నడవసాగాడు.
శవంలోనిబేతాళుడు'మహారాజాతర్కశాస్త్రము,వ్యాకరణము,వైద్యశాస్తము,జోతిష్య శాస్త్రము,ధర్మ శాస్త్రం,మీమాంస వంటిషడ్విద శాస్త్ర పారంగతుడవు నీవు నాకు చాలాకాలంగా చంద్రవంశ రాజుల గురించి తెలుసుకోవాలని ఉంది తెలిసి చెప్పకపోయావో మరణిస్తావు అన్నాడు బేతాళుడు.
' బేతాశా వివస్వతుడు ద్వాదశాదీత్యుల్లో ఒకడు,యితనితండ్రి కస్యపుడు తల్లిఅదితి.ఇతన్నే సూర్యుడుఅనికూడా అంటారు.విశ్వకర్మకుమార్తేలగు సంజ్ఞాదేవి,ఛాయాదేవిలను వివాహంచేసుకున్నాడు.ఇతనికి ,వైవస్వతుడు (ఇతనుమనువు)యముడు, శని,అనేముగ్గురుపుత్రులు,యమున,తపతి అనేఇరువురుకుమార్తేలు జన్మించారు.
వైవస్వతునికి శ్రాధ్ధదేవుడనే పేరుకూడాఉంది. భార్యశ్రధ.వీరికి ఇక్ష్మావాకుడు,నృగుడు,శర్యాతి,దిషుడు,ధృష్టుడు,కరూశుడు,నరిష్యంతుడు,వృషద్రుడు,నభగుడు,కవి అనేపదిమందిపుత్రులు జన్మించారు వీరిలో కవి అనువాడు బాల్యంలొనేమరణించాడు.ఇతనిపెద్దకుమారుడు ఇక్ష్వాకుడు ,అతనికుమారుడుకుక్షిఅతనితమ్ముడు నిమి ఈఇక్ష్వాకవంశంవారి రాజధాని అయోధ్య.వైవస్వతునిపుత్రుల్లో కురూశుడు కురూశవంశానికిమూలపురుషుడు.
సంతతికలగకముందు వైవస్వతుడు యాగం చేసి తమకు పుత్రుడుకావాలని వసిష్ఠుని వేడుకోగా "సుద్యుమ్నుడు"అనేకుమారుడిని ప్రసాదించాడు.అలాజన్మించి పెరిగి పెద్దవాడైన సుద్యుమ్నుడు  ఓపర్యాయంవేటకువెళ్ళి శరవణవనం లోనికివెళ్ళాడు.ఆవనంలో ప్రవేసించిన పురుషులుఎవరైనా స్త్రీ గా మారిపోతారు అన్నకారణంగా అతను"ఇల"అనేపేరుకలిగిన స్త్రీరూపం పొందాడు.అలా సోముని కుమారుడైన బుధుని ద్వారా పురూరవుడు-అతనిభార్యఊర్వశి. వారికిఆయువు భార్య స్వర్బాన.వారికి నహుషుడు-ప్రియంవద.వీరికి పూరుడు-కౌసల్య.వారికి జనమేజేయుడు-అనంత.వీరికి ప్రాచీశుడు-నశ్మి-వారికి సంయాతి-వరాంగి.వారికి నహంయాతి-భానుమతి.వారికి సార్వభౌముడు-సునంద.వారికిజయత్సేనుడు-సుశ్రవసు.వారికి అవాచినీడు-మర్యాద.వారికి నరిహుడు-నాంగి.వారికి మహొభౌముడు-పుష్టి.వారికిఅయుతానీకుడు-కామా.వారికి అక్రోధనుడు-కాళంగి.వారికిదేవతిధి-వైదేహి.వారికి ఋచీకుడు-నాంగి-లేక దేవ.వారికి ఋక్షుడు-జ్వాల.వారికి.మతినారుడు-సరస్వతి.వారికి త్రసుడు-కాళింది.వారికి కిలుడు-రిథంతరి.వారికి దుష్యంతుడు-శకుంతల.వారికి భరతుడు-సునంద వారికిభూమాన్యుడు-విజయ.వారికి సుహోత్రుడు-సువర్ణ.వారికిహస్తి-యశోధర.వారికివికుంఠనుడు-వసుదేవ. వీరికిఅజామీఢుడు-కైకేయి.వారికిసంవరుణుడు-తపతి.వీరికి కురుడు(కురువంశానికి మూలపురుషుడు)శుభాంగి.వీరికివిథూరధుడు-మాధవి లేక సంప్రియ.వారికి.అనశ్వుడు-అమృత.వారికిపరిక్షిత్తు-సుయశ.వారికిభీమసేనుడు-కుమారి.వారికి పరిశ్రవసుడు------వారికి ప్రతీపుడు-సునంద.వారికి శంతనుడు-గంగాదేవి లకు భీష్మడు,సత్యవతికి చిత్రాంగదుడు-అంబిక.విచిత్రవీరుడు-అంబాలిక.వీరికి ధృతరాష్టృడు-పాండురాజు కలిగారు.
ధృతరాష్టృ గాంధారి దంపతులకు నూటఓక్కరు సంతతి కలిగి వారు కౌరవులుగా పిలవబడ్డారు. పాండురాజు కుంతిలకు ధర్మరాజు భీముడు, అర్జునుడు,పాండురాజు మాద్రిలకు నకులసహదేవులు కలిగారు వీరే పాండవులుగా పేరుపొందారు.
ఉప పాండవులు ద్రౌపదికి పాండవుల వలిన కలిగిన సంతానం. వీరు మహాభారత యుద్ధం తరువాత ద్రోణకుమారుడు ఐన అశ్వత్థామచే సంహరించబడ్డారు. వీరి పేర్లు
ప్రతివింధ్యుడు - (ధర్మరాజు పుత్రుడు)
శ్రుతసోముడు - (భీముని పుత్రుడు)
శ్రుతకర్ముడు - (అర్జునుని పుత్రుడు)
శతానీకుడు - (నకులుని పుత్రుడు)
శ్రుతసేనుడు - (సహదేవుని పుత్రుడు)
పాండవులకు ద్రౌపతి వలనకాకుండా మరో భార్యలతో కలిగిన సంతతి.
పాండవులకు ఇతర భార్యవల్ల కలిగిన పుత్రులు
ధర్మరాజు + దేవిక :  యౌధేయుడు;
భీముడు + జలంధర: సర్వగుడు;
భీముడు+ హిడింబ: ఘటోత్కచుడు;
అర్జునుడు + సుభద్ర: అభిమన్యుడు;
అర్జునుడు- ఉలూచి: ఇరావంతుడు;
అర్జునుడు+ చిత్రాంగి: బభ్రువాహనుడు;
నకులుడు + రేణుమతి : నిరమిత్రుడు;
సహదేవుడు+ విజయ: సుహోత్రుడు.
ఉపపాండవులు అశ్వత్ధామ చేతిలో మరణించడానికి ఒక కథ ఉంది......
త్రేతాయుగపు కాలంనాటి హరిశ్చంద్రుని సత్యవ్రత దీక్షను పరీక్షించాలని విశ్వామిత్రుడు అతని రాజ్యము, భార్య, పిల్లలు కట్టు బట్టలతో సహా వదిలి పొమ్మని ఆదేశిస్తాడు. ఈక్రమంలో రాణిపై చేయికూడా చేసుకుంటాడు. ఆ సమయంలో పరమ వీరులయిన అయిదుగురు సైనికులు/రక్షకభటులువిశ్వామిత్రుని చర్యకు మండిపడి అతనిచర్యలను ఖండిస్తారు. దీనికి ఆగ్రహం చెందిన విశ్వామిత్రుడు మీకు ఈ జన్మలో మోక్షం రాకపోవుకాక అని శపిస్తాడు. భీతిల్లిన ఆ రక్షకభటులు మునివర్యుని శాంతింపజేసి, శాపానికి విరుగుడు ప్రసాదించమని వేడుకుంటారు. శాంతించిన విశ్వామిత్రుడు మీరు వచ్చేజన్మలో ఏ బంధాలు ఏర్పడక ముందే చనిపోవుదురు. తర్వాతి జన్మలో పాండవుల పుత్రులుగా జన్మించి ఏ తప్పు చేయనప్పటికీ అశ్వథ్థామ చేతిలో నిద్రించే సమయంలో మరణించి మోక్షం పొందుతారు అని అభయమిస్తాడు. (వారిని చంపిన అశ్వథ్థామ రహస్యం తల్లి అయిన ఉత్తర గర్భంలో ఉన్న పరిక్షిత్తుకు (అభిమన్యుని కుమారునికి) తెలుస్తుంది. ఈ విషయంతెలుసుకున్న అశ్వథ్థామ ఆ గర్భస్థ శిశువును హతమార్చాలని కూడా చూస్తాడట. కానీ శ్రీకృష్ణుడుకాపాడతాడని ఇంకొక కథ ఉంది) ఆ విధంగా పుట్టిన వారే ఉప పాండవులు....
కురుక్షేత్ర సంగ్రామంలో ఉపపాండవుల శౌర్యాన్ని గూర్చి పెక్కు ప్రస్తావనలు ఉన్నాయి. ఆరవనాటి యుద్ధంలో కౌరువులు భీమ దృష్టద్యుమ్నులపై ఒక్కుమ్మడిగా విరుచుకుపడ్డారు. అప్పుడు పాండవుల పుత్రులు ఐదుగురూ అసమానమైన పరాక్రమం చూపి కౌరవులను పరుగులు తీయించారు. ముఖ్యంగా నకులుని కొడుకు శతానీకుని ప్రతాపం అందరినీ మెప్పించాడు. పదహారవరోజు యుద్ధంలో ప్రతివింధ్యుడు విజృంభించి తోమరంతో కౌరవ వీరుడైన చిత్రసేనుని చంపేశాడు. ప్రతివింధ్యుని ఎదిరించిన కౌరవసేన పలాయనం చిత్తగించింది.
ఉపపాండవుల మరణం సౌప్తిక పర్వంలో చెప్పబడింది. "అపాండవం" చేస్తానని దుర్యోధనునికి మాట యిచ్చిన అశ్వత్థామ ఈశ్వరదత్తమైన ఖడ్గంతో పాండవసేనపై రాత్రిపూట దాడిచేశాడు. ప్రతివింధ్యున్ని అడ్డంగా నరికేశాడు. శ్రుతసోముడి గొంతు కోసేశాడు. శ్రుతకర్ముడి తల నరికి మెండాన్ని కాలితో తన్నాడు. శతానీకుని, శ్రుతసేనుని తల నరికేశాడు. ఇలా అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్యుడు కలిసి ధృష్టద్యుమ్నుడి శిబిరంలో సమస్త సేనను ఘోరంగా చంపేశారు.
పాండవుల అనంతరం పాలన అభిమన్యుడు ఉత్తరుల కుమారుడు-పరీక్షిత్తు. అతనికుమారుడుజనమజేయుడు అనంతరం శతానీకుడు, యజ్ఞదత్తుడు, నిశ్చక్రుడు, ఉపరాష్ట్రపాలుడు, చిత్రరధుడు, ధృతిమంతుడు ,సుషేణుడు, సునీథుడు, ముఖపాలుడు, నచక్షవు, సుఖవంతుడు, పారిప్లవుడు, సునయుడు,రిపుంజయుడు, మృదువు, తిగ్మజ్యోతి,బృహద్రధుడు,వసుదాముడు,శతానీకుడు,ఉద్యానుడు,అహీనరుడు,నిర్మిత్రుడు,క్షేమకుడు,అతనుమ్లేచ్ఛులచే చంపబడ్డాడు. ఇతని కుమారుడు ప్రద్యోతుడు. ఇతని కుమారుడు వేదవంతుడు, అతనికి సునందుడు ఇతనికి సంతానంలేదు.ఇలాసాగింది చంద్రవంశం 'అన్నాడు విక్రమార్కుడు.
అతనికి మౌనభంగంకావడంతో శవంతో సహా బేతాళుడు మాయమై చెట్టుపైకి చేరాడు.
పట్టువదలని విక్రమార్కుడు బేతాళునికై వెనుతిరిగాడు.

కామెంట్‌లు