టాల్ స్టాయ్ రచనలే గాంధీజీకి స్ఫూర్తి;-- యామిజాల జగదీశ్
 రష్యాకు చెందిన టాల్‌స్టాయ్ 'వార్ అండ్ పీస్' వంటి ప్రపంచ ప్రఖ్యాతి పొందిన పుస్తకాలను రాసి ప్రపంచ సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచారు. ఈయన రచనలు మన గాంధీజీ నైతిక పోరాటాలకు స్ఫూర్తినిచ్చాయి. 
భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాటాన్ని నైతిక మార్గంలో నడిపించిన గాంధీజీ
టాల్‌స్టాయ్ రచనలూ, ఆలోచనలూ తనకెంతగానో దోహదపడ్డాయని చెప్పుకున్నారు.
టాల్‌స్టాయ్ చిన్న వయస్సులో నాస్తికుడు. తరువాత జీవిత పరమార్థాన్ని తెలుసుకుని ఆధ్యాత్మిక రచనలు చేసారు. తొలినాళ్ళల్లో అవి రష్యాలో ప్రచురించకుండా నిషేధించారుకూడా. మతాలు ఏమి చెబుతున్నాయో తెలుసుకోవడానికి పరిశోధనలు చేశారు.
టాల్‌స్టాయ్ రాసిన 'ది కింగ్‌డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ వితిన్' పుస్తకం గాంధీజీపై తీవ్ర ప్రభావం చూపింది. 
దక్షిణాఫ్రికాలో గాంధీజీ నడిపిన సహాయ నిరాకరణ వంటి ఉద్యమాలకు టాల్‌స్టాయ్ ఆలోచనలే మూలం.
దక్షిణాఫ్రికాలో తన మొదటి ఆశ్రమానికి 'టాల్‌స్టాయ్ ఫామ్' అని పేరు పెట్టారు గాంధీజీ!
ప్రపంచంలోని మతాలను అధ్యయనం చేసే టాల్‌స్టాయ్‌కి బ్రిటిష్ వారి ద్వారా భారతదేశంలోని మతం గురించి తెలిసింది.  శాకాహారం, వైష్ణవం, వైదికం వంటివాటి గురించి తెలుసుకున్న టాల్ స్టాయ్ రాసిన
(1828-1910) లండన్‌ నుంచి వెలువడే ఇలస్ట్రేటెడ్ న్యూస్ వీక్లీలో "ఎ లెటర్ టు ది హిందూ" అనే వ్యాసం  గాంధీజీ దృష్టికి వచ్చింది. 
గాంధీ, టాల్‌స్టాయ్‌ మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు కూడా కొనసాగాయి. టాల్‌స్టాయ్ గాంధీజీకి రాసిన ఓ ఉత్తరంలో తమిళులు దక్షిణ వేదంగా చెప్పుకునే తిరుక్కురళ్ ని ప్రస్తావించారు. 
అది తెలిసి గాంధీజీ ఆశ్చర్యపోతారు. వల్లువర్ రాసిన తిరుక్కురళ్ గురించి టాల్ స్టాయ్ చెప్పిన తర్వాతే గాంధీజీకి తెలియడం విశేషం. ఉత్తరంలో భారతీయత గురించి టాల్ స్టాయ్ ప్రస్తావించారు. మరీ ముఖ్యంగా ప్రేమతత్వం గురించి చెప్పారు.
1886లో పోప్ అనే అతను తిరుక్కురళ్ ని ఇంగ్లీషులో అనువదించిన విషయాన్ని తెలుసుకున్న గాంధీజీ ఆ పుస్తకంమీద ఆసక్తి పెంచుకున్నారు. తనకు తమిళ భాష తెలిసుంటే బాగుండేదనికూడా చెప్పుకున్నారొకచోట.కామెంట్‌లు