సూక్తులు. సేకరణ. పెద్ది సాంబశివరావు,

 
సత్యము-
 @ ప్రతి మనిషికి ఏదో ఒక బలహీనత వుంటుంది.   ఇది నిత్య సత్యం . జార్జి హెర్బర్డ్
@ మందుకు పథ్యం ,  మాటకు సత్యం.
@ పరమేశ్వరునిలో మనమంతా సమాహితులమై ఉన్నాం.   ఈ సత్యం గ్రహించగలిగితే మన జీవననౌక ఆవలితీరం చేరినట్లే.  
@ మనమంతా సత్యమంతులమే కానీ నిత్యం సత్యం కోసం అన్వేషణ చేస్తుంటాం. రమణ మహర్షి
@ సత్యం పలకాలి. ప్రియమైన మాటలు పలకాలి. ప్రియం కాని సత్యాన్ని పలకకుండా ఉండటమే శ్రేయస్కరం.  మనుస్మృతి
@ ఈలోకంలోనే స్వర్గం చూపించే గుణాలు నిగ్రహం, సత్యం, ఆర్జవం, దయ.
@ మాటకు ప్రాణం సత్యం.   చీటీకి ప్రాణం రాత. 

కామెంట్‌లు