సునంద భాషితం;-*వురిమళ్ల సునంద,ఖమ్మం
  పని- వృత్తి
 ******
బాహ్య బలముతో శక్తిని రకరకాలుగా వినియోగించడాన్నే పని అంటారు.
సమాజంలో  వ్యక్తి జీవనభృతి కోసం ప్రత్యేక నైపుణ్యంతో చేసే పనినే వృత్తి అంటారు
వ్యక్తి చేసే పనులను బట్టి అతని మానసిక స్థితి ఆధారపడి ఉంటుంది.
పని వ్యక్తికి జీవితాంత సహచరి. ఎన్నో అనుభవాల పాఠాలను నేర్పే గురువు.
సమాజ అభివృద్ధికి దోహదపడే పనినే వృత్తిగా స్వీకరించడంలో ఆనందం, ఆత్మతృప్తి  ఉంటాయి.
పని పట్ల పెంచుకున్న నిరంతర ప్రేమ, అంకితభావమే..వృత్తిపర పనితనమై గుబాళిస్తుంది.
ప్రజల ఆదరాభిమానాలు, గౌరవాన్ని చూరగొంటుంది.
 ప్రభాత కిరణాల నమస్సులతో🙏
 


కామెంట్‌లు