బ్రతుకు బాట:- సాధకులు... ఉపాధ్యాయులే... !కోరాడ నర సింహా రావు

 **  48  ***
    *******
అవి నేను ఉమాస్టూడియో లో 
పనిచేస్తున్న రోజులు !
చెల్లయ్య హోటల్ కి ఎదురుగా చెరువు గట్టుమీద నివాసాలుం టున్న ఇళ్ల దగ్గర సినిమా షూటింగట... అప్పుడే పుట్టిన బిడ్డకోసం చూస్తున్నారని తెలిసి అప్పుడేప్రసవించినఒకామెదగ్గర నుండి బిడ్డను తెచ్చి నులక మంచం మీద ఓ మగతని పక్కన ఆబిడ్డని పడుకోబెట్టటం పోలీసులు తప్పించుకున్న నక్సలైట్ కోసం గాలిస్తూ ఆమంచం మీద ఎవరు అని అడగటం నాకూతురు ఇప్పుడే ప్రసవించింది అని ఒకామె దుప్పటి కప్పుకుని పడుకున్న నక్సలైట్ పక్కనుండి బిడ్డను తీసి చూపించటం ఆ పోలీసులు వెలిపోవటం  !
షూటింగు ఆపూట  కైపియింది 
ఆ సినిమా పేరు కొండగాలట !
రెండు భాషల్లో తీస్తున్నారట డైరెక్టర్ రామూకరియట్ !ఆసినిమా కథ రాసింది మాప్రాం తంఆయనే,భూషణం మాష్టారు
ఆ సినిమా వాళ్లంతా... వేణుగోపాల్ సినిమా హాల్ ప్రక్క నున్న రాజా లాడ్జి లో దిగారు భూషణం మాష్టారిని ఆ లాడ్జిలో ఉంచి బాగా తాగించి నామమాత్రపు డబ్బిచ్చి ఆ సినిమా కథయొక్క హక్కులన్నీ రాయించుకున్నారని మాఉమా స్టూడియోలో  గుస గుసలు !
అంతేకాకుండా... ఆ సినిమాలో మంచి వేష మిస్తామని ఓ అమ్మాయినికూడా వాళ్ళు  తెచ్చి... ఆ టీమ్ లో ప్రతి మగవాడూ... వాడుకున్నాడని నలుగురూ చెప్పుకుంటుంటే.., 
సినిమా పరిశ్రమ ఇంత ఛండాలంగా ఉంటుందా అనిపించింది !
ఆ భూషణం మాష్టారి కోవలోనే 
అట్టడప్పలనాయుడు పోడు-
పోరు లాంటి ఆదివాసీలు ... రైతులు  గురవుతున్న దోపిడీ 
నేపథ్యంగా కధలురాసి మంచి పేరుతెచ్చుకున్నారు ! ఆ తరువాత గంటేడ గౌరీనాడు మాస్టారు రైతులు వ్యవసాయ 
ఇబ్బందులు ఇవే ప్రధానంగా చాలా కధలు, కవితలు రాసి పేరు తెచ్చుకున్నారు !ఆకోవలోనే చింతా అప్పల నాయుడు, సిరికి స్వామినా యుడు ఆనేపద్యంలోనే... కధలు,కవితలు  రాస్తూ మంచిరచయితలుగా వెలుగులోకి వచ్చారు !ఒక్క అట్టాడ అప్పలనాయుడు ఉపాద్యాయుడు కాదు బ్యాంకు ఉద్యోగి మిగతావాళ్లంతా ఉపాధ్యాయులే... పైన ప్రస్తావించిన వారంతా ఒకే మిత్ర బృందం వేళ్లతోనే కలిసి తిరిగేమరికొందరు...ఆప్తచైరన్య
మంచి కవి, చిత్రకారుడు !
Sv..జోగారావు, శిష్ట్లారామకృష్ణ
హరగోపాలరావు ముగ్గురూ అన్నదమ్ములే..హరగోపాలరావు మాష్టారూ కవితలు, గేయాలు రాష్ట్రoడేవారు !
రామకృష్ణ గారు మంచి నఖచిత్ర కళాకారులు వీరితోపాటు పల్లపరిసినాయు డు మాస్టారు నఖచిత్రాలతో పాటు మంచి పెయింటింగ్స్ కూడా వేస్తుంటారు, కవిత లూ
రాస్తుంటారు !
ఆరకంగా... వెంపటాపు సత్యం, 
ఆదిభట్ల కైలాసం లాంటి ఉద్యమకారులలు మొదలుకొని... సమాజాన్ని చైతన్య పరచే కవులు, కళాకారులు అత్యధిక శాతం ఉపాధ్యాయులే ! ఎక్కడో... 
అక్కడక్కడా... మాకృపారావు మాష్టారి లాంటి వారూ ఉంటారనుకోండి !ఇలాంటి ఉపాధ్యాయులు... ఎప్పుడూ పేకాడుతూ, తాగుతూ, వాళ్ళదగ్గర చదువుకునే వయసులో ఉన్న అమ్మాయిలను వాడుకునే టీచర్ లు....ఇలాంటి నీచ ఉపాధ్యాయులు ఒకరో, ఇద్దరో అక్కడక్కడా ఉన్నప్పటికీ... అన్నిరంగాలలో పేరుతెచ్చుకున్న వాళ్లలో ఉపాధ్యాయులే నాకు ఎక్కువగా కనిపించారు... !
.   ******
    .......  సశేషం  .......
కామెంట్‌లు