బ్రతుకుబాట :- పుణ్యానికా....పాప ప్రక్షాళనకా.....!!కోరాడ నరసింహా రావు... !

  ***   44   ****
ఓమారు  మాతమ్ముడిని, మిత్రుడ్ని స్టూడియో చూసుకోమని చెప్పి నేను సతీసమేతంగా... ముగ్గురు 
చిన్న పిల్లలతో.... మూడోది 
మరీ చంటిపిల్ల... అమ్మ, నాన్న 
అందరం కలిసి దక్షిణాది యాత్రలకు 15 రోజులు బస్సుమీద ప్రయాణం... !
నరకం చూశామనే చెప్పాలి !
బస్సు బయలు డేరటమే... 
ఈరోజు రాత్రికి రావలసిన బస్సు రేపు మద్యాహ్నానికొచ్చి విసుగు పుట్టించింది...అది మొదలు  ప్రయాణమంతా. 
. ఆందోళన, అశాంతే... !
బస్సులో ఆఖరి పాపకు సీట్ల మధ్యలో ఉయ్యాల కట్టినా... 
ముగ్గురు చంటిపిల్లల మలమూత్రాలు... బస్సుఆగితే 
నీళ్లు... ఆపిల్లలకి పాలకోసం యాతనపడితేనే సరిపోయేది!
బస్సు ఆలయాలకు దూరంగా ఎక్కడో ఆపుతారు !ఏ జంఝాటమూ లేనివాళ్లు చక చకా దర్శనాలు చేసుకుని... 
చూడవలసినవన్నీ పూర్తిగా చూసుకుని టైం కి వచ్చేసే వాళ్ళు... మాకు తృప్తిగా దైవదర్శనమైనా జరిగేది కాదు 
ఓ చోట...మార్గ మధ్యలో... బస్సులోనే  నా భార్యకు చాలా ఉదృతం గా ఫిట్స్ వచ్చేసింది !
హాస్పిటల్ ఉన్నచోట బస్సు ఆపించి, వైద్యంచేయించటంలో
జరిగిన ఆలస్యానికి బస్సులో అందరికీ చిరాకు... !
ఎక్కడ  మళ్ళీ ఫిట్స్ వచ్చేస్తుందేమో నన్న భయము ఆందోళన ఓ ప్రక్క ఉరుకులు, పరుగులు మరోప్రక్క... !
అవి బ్రహ్మోత్సవాల రోజులు... 
తిరుపతిలో ఊక పో స్తే... రా ల 
ని జనం... మమ్మల్ని మొదటి రోజుఉదయంగదుల్లోకూచోబెట్టి... మరుసటి రోజు మధ్యాహ్నానికి క్యూ లైన్ లోకి వదిలారు... జనం పరుగో పరుగు... ముసలి వాళ్ళని గాని 
చిన్న పిల్లలని గాని, గర్భిణీ స్త్రీ లనిగాని చూడటం లేదు.. తోసు కుంటూ, తొక్కుకుంటూ పరుగులు తీస్తున్నారు !
అన్ని బాధలూ భరించి గర్భగుడిలోకి ప్రవేశిస్తే... కనులారా ఆ దైవాన్ని ఓ క్షణ మైనా చూసుకునే భాగ్యానికి నోచుకోలేకపోయాం ! అక్కడ పంతుళ్లు స్వామిముందు అర క్షణం కూడా నిలువ నివ్వటం లేదు... పక్కకు తోసేశారు !!
రామేశ్వరం 32 నూతుల్లోస్నానాలు ఉరుక్కులూ పరుగులే... రెండు చంకల్లో ఇద్దరు పిల్లల్ని ఎత్తుకుని... నానాయాతనా పడ్డాను !కన్యాకుమారి వెళ్లినా 
వివేకానంద రాక్ దగ్గరకు బోటుమీద వెళ్లి చూడలేకపో యిన దురదృష్టం !
ఎక్కడి కక్కడే బస్సుదిగి ఎక్కువదూరం చెప్పులు లేకుండా నడవవలసి రావటం తో... మా నాన్న బస్సులోనే ఉండిపోయి చాలా ఆలయాల దగ్గరకుకూడా రాలేక పోయాడు
తిరుపతి కొండ పైనుండి దిగువకు వచ్చేస్తున్నప్పుడు ఆ రాత్రి మేమంతా దేవస్థానం సత్రం లో పడుకున్నాం !
వేకువనే లేచి చూస్తే మానాన్న 
రెండో పాప ఇద్దరూ పక్కనలేరు 
టీతాగటానికిమానాన్నవెళుతూ
పాపను తీసుకు వెళ్ళుంటా రనుకున్నాం, కాసేపు పోయినాక మానాన్న ఒక్కరే దూరంగా కనిపించారు... పాప పక్కన లేకపోయే సరికి పరుగున వెళ్లి అడిగాను.. !
అదేమో నాకేం తెలుసు... నేను 
టీతాగటానికి వెళ్లి వస్తున్నాను అన్నారు !ఇంక పాపకోసం వెదకటం ప్రారంభించాం !
దూరంగా మరో సత్రంలోని వాచ్ మాన్... ఏమిటి అని అడిగాడు... పాపగురించి చెబితే .. ఈ పాపేనా అని పాపను చూపించాడు ఆపాప కానట్టే అనిపించింది నాకైతే..., 
ఈ పెద్దాయన వెళ్లిపోతుంటే వెనక ఏడ్చుకుంటూ ఈ పాప వెళుతుంది... ఆయన వెనక్కి చూడకుండా వెళిపోయాడు 
మేము బుజ్జగించి ఇక్కడ ఉంచాం అని చెప్పేసరికి... 
మాపాపేనని తీసుకున్నాం !
ఓ ఊర్లో చీకటి పడుతుండగా భోజనాలని బస్సును ఓ ఖాళీ ప్రదేశంలో ఆపారు... నేను మరికొంచెం దూరం వెళ్లి పాస్ పోసుకుతున్నాను దోమ ఇంజక్షన్ ఇచ్చినట్టు చాలా గట్టిగా కుట్టింది... ఆతరువాత భోజనాలు ముగించుకుని బస్సు ఎక్కేసరికి నాకు తీవ్రమైన జ్వరమొచ్చి ఒళ్ళంతా బాగాపొంగిపోయింది
మళ్ళీ మరో స్టేజ్ లో బస్సు ఆపినపుడు మెడికల్ స్టోర్ లో 
టాబిలెట్లు తీసుకుని వాడితే కాస్తనెమ్మదిగా తగ్గింది... !
ఎంత తొందరగా ఈ యాత్ర ముగుస్తుంది దేవుడా అనిపించింది... అడుగడుగునా 
యాతన, సమస్యలు ఇబ్బందులతో... అదో విహార తీర్ధ యాత్రలా కాకుండా... చేసిన ఏదో మహా పాపానికి పదిహేను రోజులు నరకంలో శిక్ష అనుభవించి వచ్చినట్లని పించింది ! ఆ తరువాత నెమ్మ నెమ్మదిగా నాకుడికాలి తొడ సందులో గగ్గలా వచ్చి రోజు రోజుకీ ఆ గఙ్గా దిగువకు జారుతూ.. పాదం పొంగటం మొదలు పెట్టి జ్వరం వస్తుండేది 
ప్రక్కనే dr. రామ్మోహన రావు గారి హొస్ఫుటల్ లో చూపిస్తే 
మీరు చాలా అదృష్టవంతులు సమయానికి మేలుకున్నారు 
ఇది ఫైలేరియా... ఇంకా అశ్రద్ధ చేసుంటే... ఇది బూరకాలుగా శాశ్వతంగా ఇలాగే ఉండిపో యేది... అంటూ ఇంజక్షన్లు కోర్సు రాసి కాంపౌన్డర్ చేత చేయించుకోమన్నారు అక్కడి కంఫౌండర్ కూడా నాకు మంచి మిత్రుడే రెండు రోజులు వరుసగా ఇంజక్షన్లు చేసే సరికి కళ్ళు, ముక్కు, ముఖం ఝం అని లాగటం మొదలు పెట్టింది డాక్టర్ గారినడిగితే... అప్పుడు తెలిసింది ఆ ఇంజక్షన్ లు వారానికొకటి వాడాలని... !
ఆరోజునుండి వారానికొక ఇంజక్షన్ చేశారు !ఐతే ఆ రాంగ్ ట్రీట్మెంటే నాకు రైటేమో ఆ ఫైలేరియా చక్కగా నయమై పో యింది... ! ఏమైనా దేవుడు దయామయుడు... పాపాలను ప్రక్షాళన గావించి పునీతులను చేస్తాడు... !
     ******
  ........   సశేషం  .......
కామెంట్‌లు