గీతాంజలి ; -రచయిత, చిత్రకారుడు : జింకా రామారావు

 55." లయపూరిత పృధ్వీరాగం” అలుపునిద్ర ఆవరించింది.  నీ హృదయాన్ని నిద్రమత్తు వీడలేదు. నీ నయనాల, ముళ్ళ మధ్య గర్వంగా ఊగుతుంది గులాబీ. కాలం వృధా కానీక మేలుకో... మేలుకో.... రాళ్ళదారి చివరన పదిలమైన ఏకాంతాన నా మిత్రుడు ఆసీనుడై నీకోసం వున్నాడు.
మోసపుచ్చకుండ అతన్ని మేలుకొలుపు.... మధ్యాన్నపు ఎండ సెగకు ఆకాశం ఆయాసపడితేనేమి? కణకణమండే ఇసుక తన దాహాన్ని పరిచి వుంచితేనేమి!
నీ హృదయకుహరం ఆనందమయం కాదా? నీ ప్రతి పాదస్పర్శకు “పృధ్వి” లయపూరిత బాధారాగాలు పలకటం లేదా?

కామెంట్‌లు