బ్రతుకుబాట :-మేల్కొన్నఆద్యా త్మికం.,కోరాడ నరసింహా రావు!

  **** 49  **** 
   ఓ రోజు... ఓ సాధు నా భవానిస్టూడియోకివచ్చి...మాటల సందర్భం లో...సాధువు యొక్క గొప్పతనానికి సంబంధించిన ఒక శ్లోకాన్ని చెప్పటంతో.. కాసేపుఆధ్యాత్మిక 
చర్చ జరిగినతరువాత అతను వెలిపొతూవున్నపుడు... అతని చేతిలో ఓ పుస్తకాన్ని నేను చూడటం... ఆ పుస్తక మేమిటి... . అని నేనడగటం... ఇదేం పుస్తకములే అన్నట్టు ముఖం పెట్టి... ఇదా... తీసుకో నాకక్కరలేదు, అని ఆపుస్తకాన్ని...అతనునాకిచ్చే   సాడు  !  అతనిపేరు కత్తెర సాధు, మావూరికి ఈశాన్యంలో కొత్తవలససమీపా న టౌన్ రైల్వేస్టేషన్ లెవెల్ క్రాసింగ్ గేట్ పక్కన అతని నివాసం !
తరువాత ఖాళీ సమయంలో... 
ఆపుస్తకాన్ని చదివాను !
అది సత్యసాయిబాబా వేసవి కాలంలో మైసూర్, బెంగళూర్ 
లలో... నెలరోజుల సత్యసాయి విద్యాలయాల విద్యార్థుల నుద్దేశించి చేసిన ప్రసంగాలు !
అంతవరకూ సత్యసాయిని గురించి కొందరు గారడీ బాబా అంటూ ఎగతాళి చెయ్యగా విన్నాను, nt. రామారావు ఒకసినిమాలో దొంగబాబాగా చూపించటం చూసాను... సాయిబాబా పట్ల అంతవరకూ నాకు సదభిప్రాయం లేదు... గానీ ఆ పుస్తకం చదివిన తరువాత విద్యార్థుల నుద్దేశించిన ఆ ఉపన్యాసాల సారాంశాన్ని అర్ధం చేసుకున్నాక
అతనివే మరికొన్ని tv.ప్రసంగాలు విన్నతరువాత 
అతనే నిజమైన భగవాన్ అనిపించింది ! ఎందుకంటే.. 
విద్య, వైద్య ఆధ్యాత్మిక దానాలతో ఆ స్థితిని ఆయన పొందగలిగారన్నది నా ప్రగాఢ విశ్వాసం.... !! 
అతనిపట్ల నా అభిప్రాయం పూర్తిగా మారిపోయింది !
ఆధ్యాత్మికం పట్ల అంతకుముం దే.. నేను ఉమాస్టూడియోలో పని చేస్తున్నప్పుడే... అప్పుడే 
నాలో ఆధ్యాత్మిక బీజాలు అక్కడే నాటబడ్డాయి !
ఓ రోజు మా వూరికి దగ్గరలోనున్న వీరఘట్టం నుండి 
స్వామీ ప్రాణవానంద అనే ఆయన తనువ్రాసిన ఓ పుస్తకం పై తనఫోటోవేయించుకోటానికి
అవసరమై ఫోటోతీయించుకుం దుకు వచ్చారాయణ !మా పెద్దగురువుతో  మాట్లాడుతూ 
రమణ మహర్షి బోధించిన *నేనెవరు *అనే విషయాన్ని మాగురువుతో చెబుతున్నపుడు ఆ ఫిలాసఫీ 
మా పెద్దగురువుకుబోధపడిందో లేదోతెలియదుగాని... నాకు ఆవిషయం బాగా బుర్రకెక్కిపో  యింది !అప్పటినుండి నాలో ఆఫ్యాత్మికచింతనమొదలవ్వట మే కాదు...నాకు తల్లీ, తండ్రీ, గురువూ దైవమూ... సర్వమూ ఆసర్వేశ్వరుడేనని పూర్తి శరణాగతితో పరమాత్మను విశ్వసించి నాకు ఎప్పుడు ఏమి కరిగినా దాన్ని దైవనిర్ణయం గా 
భావించి స్వీకరించే స్థితికి ఆరోజే వచ్చేసాను ! ఇంక ఇప్పుడు ఈ పుస్తకం చదివిన తరువాత... ఆధ్యాత్మిక బోధనలలో నున్న మాధుర్యపు రుచిని మరిగి... అప్పటినుండి మహాపురుషుల ఆధ్యాత్మిక రచనలు చదవటం ఉపన్యాసాలు వినటం... వీటికే ఎక్కువ సమయాన్ని కేటాయిం చేవాడిని! గొప్ప, గొప్ప వ్యక్తుల ఆధ్యాత్మికోపన్యాసాలు... 
ఎందరెందరివో ప్రత్యక్షంగానూ, పరోక్షంగా... tv.లలో వినటం !
గీత, బైబిల్,షిర్డీ సాయి, సత్య సాయి, జిల్లెళ్ళమూడి అమ్మ, రమణ మహర్షి, ఒకయోగి ఆత్మ కథ... ఇలా దొరికిన ప్రతి ఆధ్యాత్మిక పుస్తకం చదవటమే కాకుండా... యోగం ధ్యానం గురించికూడా తెలుసుకోవాలని రామభద్ర పురంకి దగ్గరలోని కామన్నవలస లో యోగానంద శిస్యులు రామానందగారి ఆశ్రమంలో వారిశిష్యులు Dr.వెంకటేశ్వరరావు గారిదగ్గర ఉపదేశాన్ని కూడా తీసుకున్నా ను !ప్రస్తుతం వారు అంతర్ముఖా నందగా ఎన్నెన్నో ఆధ్యాత్మికో పన్యాసాలిస్తున్నారు! యోగ, జ్ఞానాలకు సంబంధించి అపారమైన అనుభవం వారిది 
DM&Ho..గా రిటైరయ్యారు !
గంటలతరబడి అనర్గళంగా అద్భుతోపన్యాసం చెయ్యగల మహాత్ములు !
ఆతరువాత ఇంక ఆద్యాత్మికం కోసం... నాకింకేక్కడికీ వెళ్లాలనిపించ లేదు !...
ఎందుకంటే...దేన్నితెలుసుకుంటే... ఇంక మరి దేన్ని గురించీ తెలుసుకోవలసిన అవసరం ఉండదో... దాన్ని నేను తెలుసుకున్నాను !.ఇంక దేన్ని పొందితే... పొందవలసిన  దింకేదీ ఉండదో దాన్ని పొందే ప్రయత్నంలో ఉన్నాను !
ఇప్పుడు నేను ధైర్యం గా చెప్పగలను !
అహం బ్రహ్మ... అహం విష్ణు, 
అహమేవ మహేశ్వరః... 
అహం వినా... కించిత్ నాస్తి విశ్వం.. ! కేవల మొహం సర్వం అని...., 
     *******
   ...... సశేషం........
కామెంట్‌లు