తెలుగు యూనివర్సిటీ కీర్తి పురస్కారం అందుకున్న డా.వాసరవేణి పర్శరాములుకు

 బాలసాహిత్య రచయిత&పరిశోధకులు డాక్టర్ వాసరవేణి పర్శరాములుకు బాలసాహిత్య రంగంలో కృషికిగాను తెలుగు యూనివర్సిటీ  కీర్తి పురస్కారం ను హైదరాబాద్లో యూనివర్సిటీలో 11న అందజేసిందనీ  తెలంగాణ వివేక రచయితల సంఘం అధ్యక్షుడు డాక్టర్ వాసరవేణి పర్శరాములు తెల్పారు.
          ఈసందర్భంగా  పత్రికలకు తెలుపుతూ 12 ఏండ్ల బాల్యంనుంచే  బాలసాహిత్యం రాస్తున్నాననీ " చుక్ చుక్ రైలు", చల్ చల్ గుర్రం, చిర్రగోనె,గొర్రెపిల్ల, చైతన్యమూర్తి, మట్టిలో మాణిక్యం, చెట్టిరుక మొదలగునవి పుస్తకాలు రాయడంతోపాటు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో  "ఈ దశాబ్ది బాలసాహిత్యం (2001-2010)- ఒక పరిశీలన "అను అంశంపై పరిశోధన చేసి ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో తొలి వ్యక్తిగా బాలసాహిత్యంలో డాక్టరేట్ పొందానన్నారు. నిరంతరం బాలలకోసం రచనలు చేస్తూ బాలల కార్యక్రమాల్లో పాల్గొంటున్నాననీ, బాల్యంలోనే ఉత్తమ సాహిత్యంను పిల్లకు అందించినప్పుడుపునాదులు బలంగా ఉండి భావిభారత పౌరులుగా ఎదుగుతారనీ,అందుకే బాలసాహిత్యంను ఎంచుకున్నానన్నారు బాలసాహిత్య సేవను గుర్తించి ఎ.పి,తెలంగాణ జాతీయ స్థాయిలో నాకు కీర్తి పురస్కారం అందించడం సంతోషంగాఉందన్నారు.
           రాష్ట్ర మానవహక్కుల చైర్మన్ జస్టిస్ చంద్రయ్య,తెలుగు యూనివర్సిటీ వైస్ చాన్సలర్ తంగెడ కిషన్ రావు, ఓ.యు పూర్వ వైస్ చాన్సలర్ ఆచార్య సులేమాన్ సిద్ధిఖీ గార్ల చేతులమీదుగా పురస్కారం అందించారనీ  తెలిపారు.ఇందులో రిజిస్టార్ రాఘవరాజ్ భట్,డా.గంపానాగేశ్వర్,ఆచార్య మాడభూషి శ్రీధర్,ఆచార్య కమలాకర్ శర్మ,ఆచార్య వి.తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు