బ్రతుకు బాట :తప్పెవరిదైతేనేం కోరాడ నరసింహా రావు

  ****  46   ***
భార్యా, భర్తల మధ్య పరస్పర ప్రేమాను రాగాలు మాత్రమే... 
ఉంటే సరిపోదు... !ఒకరి మనసునొకరు అర్ధంచేసుకుని సర్దుకుపోయే మనసు.. ఏ ఒక్కరిలోనో ఉంటే సరిపోదు !
అది ఇద్దఱిలోనూ ఉండాల్సిందే 
పెద్దచెల్లి, బావ... ఇద్దరూ మంచివాళ్ళే ఎదుటివారికి సహాయ సహకారాలందించ టంలో...ఎవరికెవరూ తీసిపోరు 
ఐనా అసూయ ముందుపుట్టి... 
ఆడవాళ్లు తరువాతపుడతారం టారు!అదినిజమేనేమో...? అనిపిస్తుం టుంది !
మాబావది అతిమంచితనమో, అమాయకత్వమో అర్ధం కాదు!
తననికష్టకాలంలోఏమాత్రమూ కనికరించని అన్నలన్నా, వాళ్ళ పిల్లలన్నా అమితమైన ప్రేమను చూపించివాళ్ళకింద విచ్చలవిడిగా ఖర్చు పెట్టటం... 
ఈ విషయంలో... భార్యనసలు 
లెక్కచేయక కనీస ప్రాధాన్యతను కూడా ఇవ్వక పోవడం... తను సహించలేక పోయేది !అత్తామామలకింద ఎంత ఖర్చుపెట్టినా... ఎంతచూసినా తనకేమీ అనిపించేది కాదు ! గానీ అన్నలు, చుట్టాలు, స్నేహితులకు తన ఇష్టానుసారం...భార్య ఐన తనను ఖాతరు చెయ్యకుండా ఎంతపడితే అంతా ఇవ్వడం వాల్లెవలకేం జరిగినా పరిగెత్తటం తనకి నచ్చేదికాదు!
మగవాళ్ళలో  నేనుమగాడ్ని సంపాదిస్తున్నాను నాఇష్టం అనే అహం సహజమే!
 గానీ ఆడవాళ్లు ... తనభర్త ప్రేమ, ఆప్యాయతాను రాగాలు 
తనకూ తనబిడ్డలకే సొంతం కావాలని కోరుకుంటుంది !
తమపై ఏమాత్రమూ ప్రేమ కనపరచని, ఎటువంటి కష్టంలోనూ కనీస సహకారాన్నందించని వాళ్ళను ఎందుకలా పాముకు తిరగటం 
అదే ఆమె మనసును బాధించే విషయం !తనను అర్ధం చేసుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నాడన్న కోపంతో...  పెద్దకొడుకునిజల్సారాయుడిలా
తయారుచేసి, తండ్రి పట్ల గౌరవం, మర్యాదా లేని జులాయిగా తయారై... పదోతరగతి..పాసవటానికి  ఐదారుమార్లు  పరీక్షలు రాయవలసి వచ్చింది !
చూసారుకదా తల్లిదండ్రుల్లో అసఖ్యత ఒకరి మనసునొకరు తెలుసుకున్నా నిర్లక్ష్యం గా ప్రవర్తించటం పిల్లల్ని ఇల్లుని మార్చస్తుందో !
బావ వివేక వంతుడు కాబట్టి వెంటనే మేలుకొని తన తీరు కొంత మార్చుకోబట్టి... పెద్దకొడుకు కి ఉద్యోగం, సద్యోగం లేకపోయినా... మిగతా ఇద్దరు కొడుకులూ ప్రయోజకులై ఉద్యోగాలు చేసుకుంటూ... దర్జాగా బ్రతక గలుగు తున్నారు !
అదే మారెండో చెల్లి విషయాని కొస్తే ... భర్త తో అన్ని బాధలు పడినప్పటికీ... తెలివైనది కనుక... భర్తని, పిల్లల్ని సక్రమమైన మార్గంలో నడిపించింది అలాంటి తండ్రైనా (తరువాత మంచిగానే మారాడు )తల్లిదండ్రుల పట్ల గౌరవ మర్యాదలు... అన్ని కష్టాలు పడినా చదువుల పట్ల శ్రద్ద... జీవితం పట్ల బాధ్యతతో వ్యవహరించారు !
ఇద్దరూ గవర్నమెంట్ ఉద్యోగ స్తులై పేరుతెచ్చుకున్నారు..!!
ఒకఇల్లు బాగుపడాలన్నా... 
వాళ్లంతా మంచి పేరుతెచ్చు కుని, అభివృద్ధి చెందాలన్నా 
భార్యాభర్తలమధ్య అవగాహన ఒకరి మనసును ఇంకొకరు తెలుసుకుని... గౌరవించటం, 
ఒకరు పొరపాటు చేసినా ఇంకొకరు ఓర్పుతో, నేర్పుగా 
సరిదిద్దుకోగల వివేకం ఉన్నపుడే... ఆయిల్లు సుఖ, శాంతులతో అభివృద్ధి పదంలో 
నడుస్తుంది కదా.... !
    *******
    .....   సశేషం .......
కామెంట్‌లు