మేలిమిముత్యం! అచ్యుతుని రాజ్యశ్రీ

 కుప్పతెప్పల మెరిసే గాజు ప్లా ప్లాస్టిక్ వ్యర్థాల కన్నా ఓచిన్ప మేలిమి ముత్యం మేలు.మనకు బాల్యం నించి చనిపోయే దాకా ఎందరితోనో పరిచయాలు స్నేహాలు!కానీ చాలామంది రైలు బస్సు ప్రయాణికులు లాగా మనజీవితం నించి తప్పుకుంటారు.కడదాకా మనంచేసే మంచి పనులే మన వెన్నంటి వస్తాయి. ఆపదలో ఆదుకునే వాడే నిజాయితీగా మనవెంట ఉంటాడు. అందరితో మంచిగా ఉండాలి. కొందరు నక్కస్నేహంతో మన కాళ్ళ కింద నిప్పులు పోస్తారు.డబ్బు విషయంలో మొహమాటం పోతే ఇంతే సంగతులు!ఎక్కడైనా బావ కానీ వంగతోటకాడ కాదు.మరి శివా విషయంలో అదే జరిగింది. వాడికి బోలెడుమంది స్నేహితులు. ఎందుకో తెలుసా!? నాన్న షాపు లోంచి అప్పుడప్పుడు బిస్కెట్లు చాక్లెట్లు తీసికెళ్ళి ఫ్రీగా పంచుతాడు.అలా వాడికి యాభైమంది ఫ్రెండ్స్ తయారైనారు.ఆదివారం రోజు అలా వాడు తీసుకుని వెళ్లటం తండ్రికి బాధగా ఉంది. ఎనిమిదో క్లాస్ చదివే వాడి మనసు బాధ పెట్టకూడదు అని ఓఉపాయం ఆలోచించాడు. "శివా!మొత్తం  నీకు ఎంత మంది ఫ్రెండ్స్ ఉన్నారు?""అబ్బో! కనీసం  యాభైమంది పక్కా స్నేహితులు ఉన్నారు నాన్నా!ఆదివారం  అందరం  కాలనీ పార్క్ లో చేరుతాం". "గుడ్!ఎవరినైనా అడిగి ఓయాభై రూపాయలు తీసుకుని రా!రేపు ఇచ్చేస్తానని చెప్పు" సరేనని బయలుదేరిన శివా ఒక్కొక్కరి దగ్గరకు వెళ్లి అడిగాడు "ఒరేయ్!తొలి సారిగా మానాన్న  ఓయాభై రూపాయలు నన్ను అడిగాడు. నాకిడ్డీ బ్యాంకు ఖాళీ ఐంది. మళ్లీ రేపు ఇచ్చేస్తాడు."  "అయ్యో  సారీ.మాఅమ్మ నాన్న  నాకు చేతికి పైసా ఇవ్వరు.మరీ మొత్తుకుంటే ఓయాభై చేతిలో పెడతారు అంతే!" ప్రతివారూ దాదాపు ఇదే జవాబు ఇవ్వడం తో మొహం వేలాడేసుకుని వచ్చాడు.చీకటి పడింది. "శివా!యాభై రూపాయలు ఎవరైనా ఇచ్చారా?" "లేదు నాన్నా! ఎవరికీ కిడ్డీబ్యాంక్  లేదుట." నాన్న మనసులోనే నవ్వుకుంటూ అన్నాడు "సరే పద!నా ఫ్రెండ్ రాము అంకుల్ ఇంటికి వెళ్లి అడుగు దాము." "నాన్నా!ఆయన కొడుకు  నాక్లాస్!వాడు నేను ఏది ఇచ్చినా తీసుకోడు.మాఅమ్మ నాన్న అలా తీసుకోవడం తప్పు అని చెప్పారు అని అంటాడు. వాళ్ల అమ్మ ట్యూషన్ చెప్తుంది  రాము అంకుల్ జీతం సరిపోదని " శివా భావం తండ్రికి అర్ధం ఐనా ఏమీమాట్లాడలేదు. రాత్రి  ఎనిమిది దాటాక తమతలుపు తట్టిన శివా తండ్రిని చూసి ఆశ్చర్య పోయాడు ఆయన.విషయం తెలుసుకుని వెంటనే యాభై తెచ్చి  శివా తండ్రి చేతిలో పెట్టి "నీ అవసరం తీరాకే ఇవ్వరా!" అన్న  రాము అంకుల్ మాటలకి ఆశ్చర్యంగా చూశాడు శివ.ఇంటికి వచ్చాక తండ్రి అన్నాడు "శివా! నీకు యాభైమంది ఫ్రెండ్స్ ఉన్నారు. తలా ఒక రూపాయి ఇచ్చినా నీకు  యాభై జమ అయ్యేవి.నారామం ని చూశావుగదా?ఠక్కున ఎలా ఇచ్చాడో?రేపు సంక్రాంతి పండగ. ఐనా వెంటనే ఇచ్చాడు. ఇప్పుడు తెలిసిందా నిజమైన మిత్రులు అంటే ఎవరో?రేపటినుంచి నీవు ఆంటీ దగ్గరకు వెళ్లి చదువుకోవాలి.నేను నెలకి వెయ్యి రూపాయలు ఫీజ్ కింద ఇస్తాను. "నాన్న మాటలతో శివా కి జ్ఞానోదయం అయింది. 🌷
కామెంట్‌లు